ఆదివారం, మే 26, 2024
Homeసినిమానాడు రాముడికి తోడుగా హనుమంతుడు..నేడు హనుమంతునికి అండగా రాముడు

నాడు రాముడికి తోడుగా హనుమంతుడు..నేడు హనుమంతునికి అండగా రాముడు

టాలివుడ్ యంగ్ టేలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో త్వరలో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సినిమా హనుమాన్ ఇప్పటికే సంక్రాతి రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తుండడంతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు.

Hanuman Movie పై విష ప్రచారం

అయితే తాజాగా ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బట్టి చూస్తే ఈ సినిమాపై ఎంత విషప్రచారం చేస్తున్నారో అర్ధమౌతుంది. అంతేకాక మా సినిమాను ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి లేదా వ్యక్తులు మా సినిమాను రిలీజ్ కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని వాళ్ళే వెనకుండి మా సినిమాను వెనక్కు లాగుతున్నారని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ. ఇక హనుమాన్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని అన్నీ మంచి విజయం సాదించాలని అన్నారు.

ప్రశాంత్ వర్మపై ఫ్యామిలీ పై  ట్విట్టర్ లో అనుచిత వ్యాఖ్యలు 

అంతేకాక హనుమాన్ సినిమాపై మరియు తనపై తన ఫ్యామిలీపై కొందరు సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారని కావాలనే నేగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారన్నారు. సంక్రాంతి నుండి తన సినిమాను పోస్ట్ పోన్ చెయ్యాలని కొందరు వెనకుండి నడుపుతున్నారని అన్నారు. అయితే రెండు రోజుల క్రితం తాను ప్రభాస్ కు ఈ విషయం చెప్పానని అన్నారు.

Hanuman మూవీ ప్రమోషన్ కోసం ప్రభాస్ కి ఫోన్

హనుమాన్ సినిమా ప్రమోషన్ కోసం ఒక్క ఈవెంట్ అయినా చెయ్యమని కోరామని తన నిర్ణయం రెండు రోజుల్లో వస్తుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. అంతేకాక తాను ఆదిపురుష్ రిలీజ్ సమయంలో రాముడికి హనుమంతుడు ఎలాగైతే సాయం చేసాడో అలాగే తాను ఆదిపురుష్ కోసం అడగకుండానే ఈవెంట్ చేసామని తెలిపారు అయితే ఇప్పుడు కష్టాల్లో ఉన్న హనుమంతుడి కోసం రాముడు వస్తాడో లేదో చూడాలి.

Hanuman మూవీ కి సపోర్ట్ గా ప్రభాస్ ఫ్యాన్స్

ఇక హనుమాన్ సినిమాపై ప్రభాష్ ఫ్యాన్స్ ఓపెన్ గానే సపోర్ట్ ప్రకటించారు హనుమంతునికి ఎలాంటి అడ్డంకులు రాకుండా మేము చూసుకుంటామని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. అంతేకాక ఈ మాఫియా బాలివుడ్ లోనే కాదు టాలివుడ్ లో కూడా ఉన్నారని అంటున్నారు.

Hanuman హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో త్రెందింగ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

ఇక హనుమాన్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు ఇక ప్రభాస్ గనుక ప్రమోషన్ చేస్తే మరింత రీచ్ వచ్చే అవకాసం ఉంటుంది. ఇక ఈ సినిమా టాలివుడ్ ప్రేక్షకులతో పాటు బాలివుడ్ లో కూడా ఈ సినిమా గురించి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Read Also…Salaar: సలార్ మూవీపై మరీ ఇంత డర్టీ పాలిటిక్స్…!

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular