గురువారం, మార్చి 23, 2023
Homeరాజకీయంప్రభుత్వం పై నగరి మున్సిపల్ కమీషనర్ ఘాటు విమర్శలు

ప్రభుత్వం పై నగరి మున్సిపల్ కమీషనర్ ఘాటు విమర్శలు

కరోనా మహమ్మారి నుండి బయట పడేందుకు చాలా రాష్ట్రాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి అయితే ఆంద్రప్రదేశ్ మాత్రం దీనికి పూర్తి బిన్నంగా వ్యవహరిస్తుంది. దీనికి నిదర్శనమే నగరి మున్సిపల్ కమీషనర్ వెంకటరామిరెడ్డి చేసిన సెల్ఫీ వీడియో. మొన్న విశాఖపట్నం జిల్లా లోని నర్సీ పట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుదాకర్ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని  వీడియో ద్వారా  బయట పెట్టగా అతన్ని హుటాహుటిన సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసారు.

ఇప్పుడు నగరి  మున్సిపల్ కమీషనర్ ఒక వీడియోలో నగరిలో కరోనా పాజిటివ్ కేసులు నాలుగు వచ్చాయన్నారు. తమకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయారు. మా శాయశక్తులా ప్రాణాలొడ్డి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదన్నారు. ఇన్ని కస్టాలు పడి చేస్తుంటే మా బ్యాంకు ఎకౌంట్లు కూడా ఫ్రీజ్ చేశారని అన్నారు.

కరోనా నిర్దారణలో బాగంగా వీదుల్లో, ఇళ్ళల్లోకి వెళ్లి తమ ఉద్యోగులు, డాక్టర్లు , పోలీసులు, డ్యూటీ చేస్తూ పోతుంటే మాకు ప్రభుత్వ  మాస్కులు, గ్లౌజ్ లు, సూస్, వంటివి ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఇవన్నీ తమకు ఇప్పించాలని కోరారు. ఇప్పుడు మున్సిపల్ కమీషనరే వీడియో రిలీజ్ చేయడంతో కరోనా పై ప్రభుత్వ వైకరిలో డొల్లతనం బయట పడుతున్నాయి. ఇక ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకూ పొంతన లేదని డాక్టర్లకే ఇలాంటి పరిస్థితి ఉంటె కరోనా వ్యాప్తి పెరిగితే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular