ఆదివారం, జూలై 21, 2024
Homeరాజకీయంవైఎస్ జగన్ ను ఫోర్క్ తో పొడిచిన వ్యక్తి!

వైఎస్ జగన్ ను ఫోర్క్ తో పొడిచిన వ్యక్తి!

వైఎస్ జగన్ పై ఈరోజు మద్యాహ్నం విశాఖ విమానాశ్రయంలో వ్యక్తి దాడి చేసాడు. జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు కేసుకు సంభందించి రేపు నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరు కావాల్సిఉంది. దీనితో హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి ఈరోజు మద్యాహ్నం అక్కడికి చేరుకున్నారు.

విమానం బయలుదేరడానికి సమయం ఉన్నందువల్ల విఐపి రూమ్ లో ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా అటువైపు వచ్చిన ఒక వెయిటర్ తన చేతిలో ఉన్న ఫోర్క్ తో వైఎస్ జగన్ పై దాడి చేసాడు. దీనితో అక్కడేఉన్న విమానాశ్రయ సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు. వెనువెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందిచడంతో అక్కడికివచ్చిన పోలీసులకు నిందితుడిని అప్పగించారు. అక్కడినుండి వైఎస్ జగన్ ను చికిత్సకు తరలించారు. ఈదాడిలో నిందితుడు కత్తి తో వైఎస్ జగన్ భుజంపై గాయం చేసినట్లు తెలుస్తుంది.

ఈ గటన జరిగిన వెనువెంటనే విమానాశ్రయంలో ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. బయటివారు లోనికి రాకుండా అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పై దాడి గాటన తెలుసుకున్న వైకాపా శ్రేణులు పెద్దయెత్తున విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడికి వచ్చిన ఏసీపీ జగన్ పై దాడికి యత్నించిన నిందితుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే నిందితుడు వైఎస్ జగన్ వద్దకు సేల్ఫీ తీసుకుంటానని వచ్చి తన చేతిలో ఉన్న కత్తి తో జగన్ భుజంపై బలంగా దాడిచేశాడు. అయితే నిందితుడి పేరు శ్రీనివాస్ గా గుర్తించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular