శుక్రవారం, జూలై 26, 2024
HomeరాజకీయంMahasena Rajesh | టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మహాసేన రాజేష్

Mahasena Rajesh | టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మహాసేన రాజేష్

Mahasena Rajesh: మహాసేన రాజేష్ ఈ పేరు చెప్పగానే సోషల్ మీడియాలో తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. దళిత సమస్యలపై పోరాడుతూ నిరంతం రాజకీయంగానూ సోషల్ మీడియా వేదికగానూ బాగా యాక్టీవ్ గా ఉండే వ్యక్తి మహాసేన రాజేష్. అయితే గతంలో వైసీపీ పార్టీలో పనిచేసి ఆ పార్టీ నుండి ఫిబ్రవరి నెలలో టీడీపీ లోకి చంద్రబాబు సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది.

ఎప్పటికప్పుడు వైసీపీకి కౌంటర్ అటాక్ ఇస్తున్న Mahasena Rajesh

అయితే ప్రస్తుతం మహాసేన రాజేష్ టీడీపీ లో జాయిన్ అయ్యిన రోజు నుంచీ తనదైన స్థాయిలో వైసీపీ పై తన గళం వినిపిస్తూ టీడీపీ పార్టీని మరియు టీడీపీ నాయకులను దారుణంగా విమర్శించే వైసీపీ నేతలను తన సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడుతున్నారు. అంతేకాక టీడీపీ పార్టీ కార్యక్రమాలలోనూ సోషల్ మీడియా వేదికగానూ ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ వైసీపీ చేస్తున్న నేగిటీవ్ దుష్ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు.

తాజాగా మహాసేన రాజేష్ ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నియమించడంతో ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మొన్న జరిగిన టీడీపీ మహానాడు లోనూ మహాసేన రాజేష్ అద్భుతంగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే గతంలో

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటున్న Mahasena Rajesh

గతంలో చంద్రబాబుని ఎంతగానో విమర్శించానని దీనికి కారణ జగన్ చంద్రబాబుని ఒక దళిత ద్రోహిగా క్రియేట్ చేసారని ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ అనుకుని ఆయన్ని అనేక విధాలుగా విమర్శలు గిప్పించారని అన్నారు. అయితే జగన్ పార్టీ అధికారంలోకి రాగానే దళితులపై దాడులు, ఎస్సీ లపైనే ఎస్సీ కేసులు మరియు ఎస్సీ కార్పోరేషన్ ను మొత్తం నిర్వీర్యం చేసారన్నారు.

చివరికి చంద్రబాబు గారు ఇచ్చిన సంక్షేమ పధకాలు కూడా రద్దు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని చాలా అసలు దళిత ద్రోహి జగన్ అని అన్నారు. ఈ పార్టీలో తనతో పాటు దళితులకు గౌరవం దక్కుతుందని ఈ పార్టీలో చేరానని సోషల్ మీడియా వేదికగా గతంలో Rajesh Mahasena చెప్పుకొచ్చారు.

Read Also……..Amma Vodi: జగనన్న అమ్మఒడి డబ్బులు పడని విద్యార్ధులు ఇలా  చెయ్యండి….వెంటనే ఎకౌంట్ లో పడతాయ్  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular