శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeజాతీయంఏప్రిల్ 14 తరువాత పరిస్థితిపై కేంద్ర మంత్రి సంచలన నిర్ణయం

ఏప్రిల్ 14 తరువాత పరిస్థితిపై కేంద్ర మంత్రి సంచలన నిర్ణయం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నెడుతున్న నేపథ్యంలో ఎక్కడివాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకూ ఉండగా ఆ తేదీతో ముగుస్తుందా లేక పొడిగిస్తారా అనేది ప్రశ్నార్ధకం అయింది.

ఒకవేళ లాక్ డౌన్ కొనసాగింటే వేరే ప్రాంతాల్లో ఉన్న తమపరిస్థితి ఏంటని కూలీలు, ఉద్యోగస్తులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల తిండి దొరకక పనులులేక నిత్యావసరాలు కొనలేక ఇక్కట్లు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజలు కొన్ని చోట్ల లాక్ డౌన్ పాటిస్తుంటే మరికొన్ని చోట్ల ఎన్ని చెప్పినా వినడంలేదన్నారు.. అయితే ఈ నిర్బంధం 21 రోజులు మాత్రమే ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారాయన.

ఒక్క రోజు కూడా పొడిగించే పరిస్థితి రాదని భావిస్తున్నట్టు తెలిపారు. పాజిటివ్ కేసుల్లో 90 శాతానికి పైగా ఇతరదేశాలనుంచే వచ్చినవని తెలిపారు. కరోనా బాధితుల్లో 10 శతం డిశ్చార్జ్ అయ్యారని. దీన్ని బట్టి చూసుకుంటే మరింత అవగాహనతో లాక్ డౌన్ పాటిస్తే ఏప్రిల్ తరువాత పరిస్థితులు మారొచ్చని అయన అభిప్రాయపడ్డారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular