గురువారం, ఫిబ్రవరి 22, 2024
HomeసినిమాProject k లో ప్రభాస్ కంటే రెట్టింపు రెమ్యునరేషన్ తీసుకోనున్న కమల్ హాసన్

Project k లో ప్రభాస్ కంటే రెట్టింపు రెమ్యునరేషన్ తీసుకోనున్న కమల్ హాసన్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం Project k. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి టాలివుడ్ మరియు బాలివుడ్ లోని టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండగా ఇప్పుడు వీరి సరసన మరో టాప్ స్టార్ కమల్ హాసన్ చేరిపోయారు. కమల్ హాసన్ Project k లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించడంతో కమల్ హాసన్ నటిస్తారనే ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు వీడిపోయాయి.

అయితే Project k కోసం కమల్ హాసన్ భారీ పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తోంది తన సినిమాలకంటే రెండు రెట్ల ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక బాలివుడ్ మీడియా సంస్థ కధనం ప్రకారం 100 నుండి 130 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలిపింది. ఈ రెమ్యునరేషన్ ప్రభాస్ కంటే ఎక్కువనే చెప్పాలి. అంతే కాక కమల్ హాసన్ నెగిటీవ్ క్యారెక్టర్లో ఇప్పటి వరకూ చెయ్యని కొత్త కేరెక్టర్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ముగ్గురు టాప్ హీరోలు కలిసి ఒకే సినిమాలో చెయ్యడం ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి.

Read Also…Salaar, Project k updates: మరొక పది రోజుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular