ఆదివారం, జూలై 21, 2024
Homeఅంతర్జాతీయంఅమెరికాలో బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు...రేట్లు భారీగా పెంపు

అమెరికాలో బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు…రేట్లు భారీగా పెంపు

ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఎగుమతి దారులలో అగ్రస్థానంలో ఉన్న భారత్ ప్రతీ ఏటా మన దేశం లోని ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, హర్యానా, ఒడిశా, ఛత్తీస్ గడ్, వంటి రాష్ట్రాల్లో వరి ప్రధాన పంటగా సాగుతున్న తరుణంలో ఈ రాష్ట్రాల నుండి ఇతర దేశాలకు భారీ ఎత్తున బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. బియ్యం ఎగుమతుల్లో సోనా మైసూరి, బాస్మతి బియ్యం ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఈ బియ్యం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న దేశాలలో US, UK, KUWAIT, CANADA, UAE, KATAR, IRAN, దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తుంది భారత్. అయితే ఈ ఎగుమతులు సుమారు 21.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.

గత కొన్ని రోజుల క్రితం సోనామైసూరి, బాస్మతి మినహా మిగతా అన్ని రకాల బియ్యం అమెరికాకు ఎగుమతి చేయడంపై భారత్ బ్యాన్ విధించింది. ఇలా బ్యాన్ విధించిన విషయం అమెరికాలోని న్యూస్ చానళ్లు అక్కడ హైలెట్ చెయ్యడంతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఒకవేళ భారత్ మొత్తం అన్ని బ్రాండ్ ల బియ్యాన్ని బ్యాన్ చేస్తుందనే ఉద్దేశ్యంతో మొదట కొంతమంది బియ్యం కొనుగోళ్లు చెయ్యగా ఈ విషయం బయటికి పొక్కడంతో అక్కడ ఉంటున్న భారతీయులు భారీ స్థాయిలో మార్ట్స్, షాపింగ్ మాల్స్ లో ఉన్న మొత్తం బియ్యాన్ని కాళీ చేస్తున్నారు.

ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి దారుణంగా తయారైంది.ఒక్కొక్కరు ఏకంగా పదేసి బియ్యం కట్టలను పట్టుకుపోతుండడం తో చాలా స్టోర్ లలో బియ్యం కాలీ అయిపోయాయి. ఇదే అదునుగా స్టోర్లలో ఇప్పుడు భారీ ధరకు అమ్ముతున్నారు. అక్కడివారంతా ఆఫీసులకు లీవ్ పెట్టి మరీ బియ్యం కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో బియ్యం కొరత వచ్చేసింది దీనిని నివారించడం కోసం ప్రభుత్వం సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

Read also…Rafale Deal: INS Vikranth యుద్ద విమానం కోసం మరిన్ని రాఫెల్స్ కొనుగోలు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular