శనివారం, జూలై 27, 2024
Homeక్రీడలుమీరు పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడితేనే మేము వరల్డ్ కప్ ఇండియాలో ఆడతాం....పాక్

మీరు పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడితేనే మేము వరల్డ్ కప్ ఇండియాలో ఆడతాం….పాక్

2023 భారత్ లో జరగబోయే వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కు ప్రపంచ దేశాల ప్లేయర్లు కసరత్తులు మొదలుపెట్టేసారు అయితే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాత్రం భారత్ లో ప్రపంచకప్ ఆడడంపై కొత్త రాగం తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ భారత్ పాకిస్థాన్ మద్య  మ్యాచ్ లు ఉంటె వాటిని దుభాయ్ లోనో మరోచోటో నిర్వహించే వారు ఇయితే ఇప్పుడు జరిగేది ప్రపంచకప్ ఇది తప్పనిసరిగా ఇండియాలోనే ఆడాల్సిందే దీనితో పాకిస్థాన్ ఇండియా వెళ్లి ఆడాలా వద్దా అని ఆలోచిస్తోంది.

దీనిలో భాగంగానే నిన్న పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ మరియు పాకిస్థాన్ విదేశాంగ శాఖా మంత్రి బిలావల్ బుట్టో మరియు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ స్పోట్స్ మినిస్టర్ రియాజ్ హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసి పాకిస్థాన్ భారత్ కు వెళ్లి వరల్డ్ కప్ ఆడాలా వద్దా అనే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చారు.

పాకిస్థాన్ భారత్ వచ్చి ప్రపంచ కప్ మ్యాచ్ లు ఆడాలంటే  ఈ ఏడాది ఆగష్ట్ నెలలో పాకిస్థాన్ లో జరగభోయే 2023 Asia Cup కు భారత్ పాకిస్థాన్ వచ్చి ఆడితేనే మేము ఇండియాలో ప్రపంచకప్ ఆడతామని చెబుతోంది. ఒకవేళ భారత్ పాకిస్థాన్ లో ఆడకుండా వేరే దేశంలోమ్యాచ్ కు పట్టుపడితే మేముకూడా భారత్ లో కాకుండా వేరే దేశంలో ప్రపంచకప్ అదెందుకు పట్టుపడతామని పాకిస్థాన్ చెప్పింది.

ఇప్పటికే పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది ఇక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది భారత్ పాకిస్థాన్ మద్య మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసు అందుకే బారత్ మ్యాచ్ పాకిస్థాన్ లో జరిగితే అక్కడి క్రికెట్ బోర్డు కి కొంతైనా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. అయితే ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 17 వరకూ ఆసియా కప్ జరగనుండగా దీనికి పాకిస్థాన్ మరియు శ్రీలంక దేశాలు ఆతిద్యమివ్వనున్నాయి. అయితే భారత్ ప్రభుత్వం మరియు BCCI ఈ విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

Read Also…ICC World Cup 2023: IND vs PAK వరల్డ్ కప్ మ్యాచ్ పై సందిగ్ధత

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular