Homeఅంతర్జాతీయంDengue Cases: బంగ్లాదేశ్ లో భారీగా డెంగ్యూ మరణాల నమోదు

Dengue Cases: బంగ్లాదేశ్ లో భారీగా డెంగ్యూ మరణాల నమోదు

బంగ్లాదేశ్ ను డెంగ్యూ వ్యాధి భారీ స్థాయిలో వణికిస్తోంది ఎన్నడూ లేని విధంగా దేశ వ్యాప్తంగా భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతున్న పరిస్తిస్తి కొనకొంది. 24 గంటల్లో 2495 మందికి డెంగ్యూ వ్యాధి సోకగా ఈ డెంగ్యూ వ్యాధి తో 10మంది మరణించారు.

బంగ్లాదేశ్ లో ఇప్పటివరకూ మొత్తం 63 వేలకు పైగా కేసులు సమోదు అవ్వగా 300 మంది వరకూ ఈ డెంగ్యూ వ్యాది బారిన పడి చనిపోయారు. 2000 సంవత్సరం తరువాత మళ్ళీ ఇన్ని డెంగ్యూ కేసులు రావడంతో ఎక్కడ చూసినా డెంగ్యూ వ్యాదిగ్రస్తులే కనిపిస్తున్నారు. ఇక ప్రభుత్వ హాస్పటల్స్ అయితే డెంగ్యూ తో బాధపడుతున్న పేషెంట్ లతో కిక్కిరిసిపోయాయి. పేషెంట్ లకు బెడ్స్ లేక నానా అవస్థలు పడుతున్నారు.

దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యరమాలపై ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వర్షాల కారణంగా దోమల ఉదృతి విపరీతంగా పెరగడంతో భారీ స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి.  భారత్ లో కూడా డెంగ్యూ కేసులు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి డిల్లీ లో జనవరి 1 నుండి జూలై 22 వరకూ నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య 190 ఇది గతంతో పోలిస్తే ఇదు రెట్లు పెరిగినట్లు అదికారులు వెల్లడించారు.  

Read Also…Samudrayaan: మత్స్య 6000 తో సముద్ర గర్భంలో పరిశోధనలు చెయ్యనున్న భారత్

- Advertisment -

Most Popular