శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023
Homeరాజకీయంమీ కుమారుడు BCCI కార్యదర్శి ఎలా అయ్యాడు...ఉదయనిధి స్టాలిన్

మీ కుమారుడు BCCI కార్యదర్శి ఎలా అయ్యాడు…ఉదయనిధి స్టాలిన్

శుక్రవారం తమిళనాడు లోని రామేశ్వరం వద్ద బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర మొదలు పెడుతున్న తరుణంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా అక్కడకు వచ్చి ఆ పాదయాత్రకు జెండాఊపి పాదయాత్రను ప్రారంభించారు. తరువాత రాజకీయ అంశాలపై మాట్లాడిన అమిత్ షా తమిళనాడు క్రీడా శాఖా మంత్రి ఉదయనిది స్టాలిన్ ని ఉద్దేశిస్తూ స్టాలిన్ ప్రభుత్వం పై పలు వ్యాఖ్యలు చేసారు.

డీయంకే ఎప్పటికీ వారసత్వ పార్టీయేనంటూ డీయంకే మరియు డీయంకే మిత్ర పక్షాలు వారసత్వ నాయకులను, వారసత్వ రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తుందని ఇలాంటివి ఎప్పుడూ వంశపారంపర్య రాజకీయ పార్టీలంటూ ఎప్పటికైనా స్టాలిన్ ను ముఖ్యమంత్రి చెయ్యడమే లక్ష్యంగా వంశపారంపర్య పార్టీలు అన్నీ కలిసి పనిచేస్తున్నాయని అమిత్ షా అన్నారు.

అమిత్ షా వ్యాఖ్యలు చెయ్యడంపై క్రీడా శాఖా మంత్రి ఉదయనిది స్టాలిన్ బదులిస్తూ తాను ఎన్నికల్లో పోటీచేసి తమ ప్రజలు ఓటు వేస్తే గెలిచిన తరువాత మాత్రమె మంత్రి పదవి లోకి వచ్చానని అన్నారు. అయితే మీ పుత్రుడు BCCI కార్యదర్శిగా ఎలా నియమితుయ్యాడని ఇప్పటివరకూ ఎన్ని క్రికెట్ మ్యచ్ లు ఆడాడు, ఎన్ని రన్స్ చేశాడు క్రికెట్ ఆడకుండానే BCCI కార్యదర్శి అయ్యాడా అని అమిత్ షా ను అడగాలని అనుకుంటున్నానని స్టాలిన్ అనారు.

Read Also..Halal Tea: వందేభారత్ ట్రైన్ లో హలాల్ టీ ఇచ్చారంటూ రైల్వే సిబ్బందిపై ప్రయాణికుడి ఆగ్రహం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular