శనివారం, ఏప్రిల్ 20, 2024
HomeసినిమాRana Daggubati: సోనమ్ కపూర్ కి సారీ చెప్పిన హీరో రానా

Rana Daggubati: సోనమ్ కపూర్ కి సారీ చెప్పిన హీరో రానా

Rana Daggubati: టాలివుడ్ హీరో దగ్గుబాటి రానా తాజాగా ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారి తీసాయి. రెండు రోజుల క్రితం దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న “కింగ్ ఆఫ్ కోతా” (King of Kotha) సినిమాకి సబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రానా ను ఆహ్వానించారు మరొక గెస్ట్ గా హీరో నాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ముందుగా నాని దుల్కర్ గురించి మాట్లాడగా తరువాత రానా మైక్ తీసుకుని మాట్లాడుతూ నాని లాగా నేను పద్దతిగా మాట్లాడలేను అంటూ కింగ్ ఆఫ్ కోతా ట్రైలెర్ చూసిన తరువాత తనకు ఎంతో ఎగ్జైట్మెంట్ ఉందంటూ దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ గురించి చెబుతూ తను మా యాక్టింగ్ స్కూల్ లో తన జూనియర్ అంటూ అప్పుడే మా మద్య పరిచయం ఏర్పడిందని అన్నారు.

దుల్కర్ పద్దతైన మనిషి అని ఎందుకంటున్నానంటే తను ఒక హిందీ చేస్తున్నప్పుడు మా ఇంటి దగ్గర ఆదివారం షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను అక్కడికి వెళ్లానన్నారు దుల్కర్ ఒక ప్రక్క నుంచుని ఉంటే హిందీలో ఒక పెద్ద హీరోయిన్ షూటింగ్ ఒక వైపు జరుగుతుంటే తన భర్తతో షాపింగ్ గరించి మాట్లాడుతుందని అయితే దుల్కర్ మాత్రం ఎండలో షూటింగ్ లో అలాగే నిలుచుని ఉన్నాడని ఆ హీరోయిన్ పై కోపంతో చేతిలోని బాటిల్ నేలకేసి కొట్టానని ఈయన (దుల్కర్) మాత్రం అలాగే నిలుచుని ఉన్నాడని తను వేల్లెడప్పుడు కూడా కార్ల హడావిడి చేస్తూ వెళ్ళిపోయిందని తరువాత దుల్కర్ తన ఇన్నోవా కారులో వెళ్లిపోయాడని అన్నారు.

షూటింగ్ పూర్తి అయ్యాక డైరెక్టర్ ని పిలిచి తిట్టానని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రానా అనారు. అయితే ఈ విషయం బాలివుడ్ వర్గాల్లో దుమారం  చెలరేగింది. దుల్కర్ సినిమాలో చేసింది సోనమ్ కపూర్ ది జోయా ఫ్యాక్టర్ అనే సినిమాలో నటించిన హిందీ హీరోయిన్ అని తెలుసుకుని ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికపై ఆమెపై మండిపడ్డారు. సోనమ్ కపూర్ ను టార్గెట్ చెయ్యడంతో ఆమె ఫ్యాన్స్ కూడా రానాపై తిరిగి కౌంటర్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం బాలివుడ్ మీడియాలో రచ్చ రచ్చ గా సాగుతుంది.

ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ఇటు దుల్కర్ ఫ్యాన్స్ అటు బాలివుడ్ ఫ్యాన్స్ సోనమ్ కపూర్ ను విమర్శించడం మొదలు పెట్టడంతో రానా ఈ విషయంలో కలుగజేసుకుని సోనమ్ కపూర్ మరియు దుల్కర్ తనకు మంచి స్నేహితులంటూ నేను చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ తప్పుగా అర్ధం చేసుకున్నారని ఈ విషయం ఇక్కడితో ఆపాలంటూ తను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని తన ట్విట్టర్ లో రానా Rana Daggubati పోస్ట్ చేసారు.

Read Also…ప్రభాస్ కు అంత సీన్ లేదు…సలార్ కు సవాల్ విసిరిన బాలివుడ్ డైరెక్టర్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular