శనివారం, జూలై 27, 2024
Homeటెక్నాలజీFalaknuma Express: ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ లో అగ్నిప్రమాదం నాలుగు భోగీలు దగ్ధం

Falaknuma Express: ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ లో అగ్నిప్రమాదం నాలుగు భోగీలు దగ్ధం

Falaknuma Express: గత కొంతకాలంగా జరుగుతున్న రైల్ యాక్సిడెంట్ ఘటనలతో రైల్వే శాఖకు కంటిమీద కునుకుండడంలేదు. ఇంతకు మునుపు ఒకటో రెండో చిన్న చిన్న ఘటనలు మాత్రమే నమొదయ్యేవవి అయితే గత  కొద్ది రోజులుగా ట్రైన్ యాక్సిడెంట్స్ ఘటనలు పునరావృతం అవ్వడంతో రైల్వే అధికారులకు ఏంచెయ్యాలో పాలుపోవడం లేదు. కొన్ని రోజుల క్రితం జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ లో సుమారు 294 మంది చనిపోవడంతో ఒడిశా రాష్ట్రంలోని అతిపెద్ద ట్రైన్ యాక్సిడెంట్స్ గా నిలిచింది. ఇదిగడిచిన కొద్దిరోజులకు గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో సుమారు ఆరు బోగీలు వేరొక ట్రాక్ పై పడ్డాయి అయితే అటువైపు వెళ్ళే ట్రైన్ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఈ రెండు ఘటనలు జరగక ముందే నేడు హౌరా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ బొమ్మయిపల్లి వచ్చే సరికి S4 బోగీలో మంటలు చెలరేగడం మొదలయ్యాయి ప్రయాణిస్తున్న ట్రైన్ లో మంటలు చెలరేగడంతో అత్యంత తొందరగా అవి మరొక బోగీలోకి చేరి మంటల తీవ్రత అదికమవ్వడంతో ప్రయాణికులు లోకో పైలట్ కి సమాచారం ఇవ్వడంతో వెంటనే లోకో పైలెట్ ట్రైన్ ఆపివేశారు అప్పటికే మంటలు మూడోబోగీకి చేరి మొత్తం మూడు బోగీలు కాలి బూడిద అయ్యాయి.

మరో నాలుగు బోగీలను మంటలు చెలరేగడంతో అవి కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మొత్తం ట్రైన్లోని ప్రయాణికులను వెంటనే క్రిందకు దింపేయడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రయాణికులను బస్సుల్లో హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఈఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ రూట్లోని అన్ని రైళ్ల టైమింగ్స్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

Read Also…Vande Bharat: భారీగా తగ్గనున్న వందే భారత్ రైల్ టికెట్ చార్జీలు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular