ఆదివారం, జూలై 21, 2024
HomeజాతీయంVande Bharat: భారీగా తగ్గనున్న వందే భారత్ రైల్ టికెట్ చార్జీలు

Vande Bharat: భారీగా తగ్గనున్న వందే భారత్ రైల్ టికెట్ చార్జీలు

భారతీయ రైల్వే ప్రవేసపెట్టిన అత్యాధునిక రైల్వే సర్వీస్ వందే భారత్. ప్రస్తుతం ఈ రైల్ సర్వీస్ ను దేశ వ్యాప్తంగా మొత్తం 24 రాష్ట్రాల్లో కొత్త రూట్లతో కలిపి సుమారు 75 వందే భారత్ రైళ్ళ అర్వీస్ ను నడుపుతుంది ఇండియన్ రైల్వే. వందే భారత్  ట్రైన్స్ వచ్చినప్పటి నుండీ జనాల్లో ఈ ట్రైన్స్ పై ఒక కొత్త క్రేజ్ ఏర్పడింది. ఒక విధంగా ప్రజలకు టైమ్ సేవింగ్ తో పాటు లగ్జరీగా ట్రావెల్ చేసిన అనుభూతి కూడా కలుగుతుండడం ప్లస్ పాయింట్. అయితే టికెట్ ప్రైజ్ భారీగా ఉండడంతో ఈ Vande Bharat Express ట్రైన్స్ లో ప్రయానించాలని అనుకునే వాళ్ళకు ఒక సమస్యగా మారింది.

గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా తిరుగుతున్న వందే భారత్ రైళ్ళ ఆక్యుపెన్సీ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం టికెట్ రేట్ ఇంత రేట్ పెట్టి రైల్ జర్నీ చేయడానికి చాలా మంది సుముఖత చూపించడం లేదు అదీకాక పూర్వం సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే వందే భారత్ ఇప్పుడు దీని వేగాన్ని 80కి తగ్గించడంతో దీనిపై ప్రయాణానికి సుముఖత చూపించడం లేదు.

దీనితో ప్రయాణికులు తగ్గిపోవడంతో ప్రస్తుతం టికెట్ ప్రైజ్ ను దృష్టిలో పెట్టుకిని భారతీయ రైల్వే సర్వీస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న Vande Bharat Express రైళ్ళ టికెట్ చార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. దీనితో ఆక్యుపెన్సీ పెరిగి సాధారణ ప్రజలు కూడా ప్రయాణించడానికి వీలుగా ఉండాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రైల్ సర్వీస్ చేభుతోంది. అయితే ప్రస్తుతం తక్కువ దూరం ఉన్న రైళ్ళ టికెట్ చార్జీలు తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మిగతా వాటి ధర ఎలా ఉంతుందో  వేచి చూడాలి.  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular