గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeజాతీయంకరోనాని ఢీల్లీ నుంచి తీసుకొచ్చి ఏపీకి అంటించారు

కరోనాని ఢీల్లీ నుంచి తీసుకొచ్చి ఏపీకి అంటించారు

ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో  పాల్గొన్న వారిని కరోనా కలవరపెడుతోంది. కరోనా విలయతాండవం చేస్తున్నా గుమిగూడి ప్రార్ధనలు చేయడాన్ని అంతా తప్పుపడుతున్నారు.  దీనికి ప్రభుత్వం ఎలా అనుమతులు ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ కార్యక్రమంలో పాల్గొని రాష్టానికి వచ్చినవారిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలడం అలాగే వారితో సన్నిహితంగా ఉన్నవారిలో కూడా కొంతమందికి కరోనా లక్షణాలు బయటపడటం ఇప్పుడు అందరిని హడలెత్తిస్తోంది.  ఎందుకంటే ఈ కార్యక్రమంలో రాష్టం నుంచి 500 మందివరకూ పాల్గొన్నట్టు తెలుస్తోంది.

వీరిలో అనంతపురం, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు,  ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు  చెందినవారున్నారు. వీళ్లలోనుంచి 200 మందినుంచి నమూనాలు సేఖరించగా వాళ్లలో ఐదుగురికి కరోనా ఉన్నట్టు తేలడం ఇప్పుడు భయాందోళనలు కలిగిస్తోంది.

విజయవాడ,రాజమహేంద్రవరం లో నమోదైన మరణాలు కూడా ఢిల్లీ కార్యక్రంలో హాజరయ్యి వచ్చినవారి ఇళ్లలోనే కావడంతో అంతా అలర్ట్ అయ్యారు. అయితే చనిపోయినవారి ఇంకా కరోనా నిర్ధారణ కాలేదు.

వివరాల లెక్క చుస్తే రాష్టం నుంచి  ఢిల్లీ మత కార్యక్రమానికి హాజరైనారు 500 మంది. దింట్లో అనంతపురం, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు,  ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు చెందినవారున్నారు.

వీరినుంచి 200 మందినుంచి నమూనాలు సేఖరించగా వాళ్లలో ఐదుగురికి కరోనా ఉన్నట్టు వైద్యులు తేల్చారు. నమూనాలు సేఖరించినవారిలో ప్రకాశం జిల్లాకు చెందినవారే 103 మంది. వీరిని ఒంగోలు, మార్కాపురం,  చీరాలలో క్వారెంటెన్ లో ఉంచారు.

కేసుల నిర్ధారణ విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా 68 నమూనాలను పరీక్షించగా 66 నెగిటివ్ అని తేలినట్టు వైద్య ఆరోగ్య శాఖా సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపిసిది.

ఈ నేపథ్యంలో కొత్తగా నమోదయిన ఆ రెండు కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారివి కావడం అందరినీ కంగారుపెడుతోంది. ఆ రెండుకేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి దింతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23 కి చేరింకేది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular