మంగళవారం, జూన్ 18, 2024
Homeఅంతర్జాతీయంకరోనా వ్యాక్సిన్ రెడీ .. రేపే మనుషులపై ట్రయల్స్..

కరోనా వ్యాక్సిన్ రెడీ .. రేపే మనుషులపై ట్రయల్స్..

నేడు ప్రపంచ దేశాలన్నీ కరోనా కేసుల భయంతో వణికిపోతున్నాయి ఒక వైపు పాజిటీవ్ కేసులు రోజుకు లక్షల్లో వస్తుంటే మరణాలు సైతం భారీగానే పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ కరోనా ను నియంత్రించే వ్యాక్సిన్  అందుబాటులోకి రాకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న పరిస్థితి. అమెరికా, ఇండియా, చైనా ఇంగ్లాండ్ వంటి అనేక దేశాలు ఈ కరోనా వ్యాక్షిన్ కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నాయి.

మరికొన్ని దేశాలైతే మనుషులపై ట్రైల్ రన్ కూడా ఇప్పటికే మొదలు పెట్టేశాయి. ఒక వారం క్రితం అమెరికాకు చెందినా ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఒక మహిళపై కరోనా ట్రైల్ మొదలు పెట్టగా ఇప్పుడు ఇంగ్లాండ్ లోని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేసింది.

అయితే ఈ వ్యాక్సిన్ ఇకపై  మనుషులపై ప్రయోగిస్తారు. ఈ వ్యాక్సిన్ తయారీ చేయడానికి పలు సంస్థలు ఇప్పటికే విరాళాలు ప్రకటించాయి. అన్నిదేశాలలో ప్రస్తుత పరిస్థితి చేయిదాటి పోతున్న తరుణంలో పగలూ రాత్రీ అనే తేడాలేకుండా శాస్త్రవేత్తలు ఎంతో స్రమిస్తున్నామన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ మొదటగా 18 సంవత్సరాల నుండి 55 ఏళ్ల లోపు వారిపై ఈ వ్యాక్సిన్ పరిక్షలు జరపనున్నట్లు తెలుస్తోంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular