శనివారం, జూలై 27, 2024
Homeరాజకీయంశుభవార్త ఏపీలో నగదు పంపిణీ..

శుభవార్త ఏపీలో నగదు పంపిణీ..

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. దీంతో వాళ్లని ఆదుకోవడానికి ప్రభుత్వం బియ్యం కార్డుల ఆధారంగా 1000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని శనివారం లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం కొత్తవిధానాన్ని తీసుకొచ్చింది. ఈ పంపీణీలో వాలంటీర్ల పాత్రకీలకం కానుంది. వాలంటీర్ల క్లస్టర్ల పిరిధిలోని 50 కుటుంబాల వివరాలను వాలంటీర్ల పేరు మీద మ్యాపింగ్ చేశారు.

వాలెంటీర్లకు దగ్గరున్న ట్యాబ్లకి జీపీఎస్ వ్యవస్థను పొందుపరిచారు. ఇందులో రెషన్ కార్డ్ వివరాలను నమోదుచేశారు. వాలంటీర్లు ఈ ట్యాబ్లను తీసుకుని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి జీపీఎస్ ఆన్ చేసి బియ్యం కార్డులోని కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరిని ఇంటి ముందు నిల్చొబెట్టి ఫోటో తీస్తారు. లబ్ధిదారుల వివరాలతోపాటూ ఆ ఇంటి పరిసరప్రాంతమూ ట్యాబ్లో అమర్చిన జీపీఎస్ లో నమోదవుతాయి.

ఇలా జియోట్యాగింగ్ చేసిన తర్వాత డబ్బులు అందజేస్తారు. ప్రభుత్వ సాయం పేదలకు పక్కాగా చేరేలా ఆ విధానాన్ని తీసుకొచ్చారు. ఎవరైనా దీన్ని అతిక్రమించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే జీయోట్యాగింగ్ ద్వారా ఈజీగా దొరికిపోతారని అధికారులు లెలిపారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular