గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeజాతీయంమేం సిద్ధం ఇక కరోనా పై యుద్ధమే

మేం సిద్ధం ఇక కరోనా పై యుద్ధమే

కరోనా వెంటాడుతోంది. దానిపై పోరుకు ఇప్పటికే డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, నర్సులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ దాని విజ్రుంభణ ఆగడంలేదు. అందుకే దానిపై మరింత మంది ఏకమై పోరు జరపాలని మార్చి 25 న ప్రభుత్వం విశ్రాంత వైద్య బ్రుందాన్ని అలాగే స్వచ్ఛంద సేవకై ముందుకు వచ్చి పేర్లు నమోదు  చేసుకోవాలని కోరిన విషయం తెలిసిందే.

దీనిలో భాగంగానే కరోనా పై యుద్ధ భేరి మోగించడానికి 30,100 మంది వైద్యసిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. దీంట్లో సైనిక వైద్య సేవకులు, విశ్రాంతి ప్రభుత్వ వైద్యులు, ప్రైయివేట్ వైద్యులూ ఉన్నారని ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

ప్రస్తుతం వైద్యశాఖ ప్రకారం దేశంలో 2,301 కోవిడ్ 19 కేసులు ఉన్నాయి. 56 మంది మృతి చెందారు. ఇప్పుడు ప్రపంచాన్ని సెరవేగంగా విస్తరించి మన భారత్ లో కూడా వ్యాపిస్తున్న ఈ నావెల్ కరోనాపై యుద్ధానికి సిద్ధం కావాలని నీతి ఆయోగ్ వెబ్ సైట్లో మార్చి 25 న ఇచ్చిన ప్రభుత్వ ప్రవటన కు స్పందన లభించింది.

మనదేశంలోనే కాదు కరోనాతో పోరాడుతున్న ఇతర దేశాలు కూడా విశ్రాంత వైద్యులు కరోనాపై యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇది మంచి ఫలితాలనిస్తుందని అందరూ భావిస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular