ఆదివారం, జూలై 21, 2024
Homeరాజకీయంమీ ఆదాయంలో మాకూ కొంత ఇస్తే బాగుంటుంది జగన్

మీ ఆదాయంలో మాకూ కొంత ఇస్తే బాగుంటుంది జగన్

ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో  రాష్ట్రంలోని ఏపీ ఎస్ ఆర్టీసీ తో జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్నీ మూతపడి ప్రభుత్వ ఖజానాలో డబ్బు కూడా ప్రజా ప్రయోజనార్ధం ఖర్చుపెడుతున్న నేపథ్యంలో తమకు ఆర్టీసీ సహకరించాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుని ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీలో వచ్చే ఆదాయాన్ని కొంత ప్రభుత్వానికి ఇవ్వాలని అయన కోరారట.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ లో లోటుపాట్లతో పాటు లాక్ డౌన్ ముందు ఓఅర్ ఎందుకు పడిపోయిందో జగన్ అడిగి తెలుసుకున్నారట. లాక్ డౌన్ నేపథ్యంలో రాబడి తక్కువగా ఉన్న ప్రభుత్వానికి ఆర్టీసీ సహకరించాలని సీఎం కోరినట్టు సమాచారం. అయితే ప్రతీ నెలా వచ్చే ఆదాయంలో ఎంతమొత్తం ప్రభుత్వానికి ఇవ్వాలి అనేదాన్ని ఆర్ధిక శాఖతో కలిసి ఓ నిర్ణయానికి రావాలని తెలిపినట్టు సమాచారం

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular