ఏపీ ప్రభుత్వం విద్యార్ధులకు సంబంధించి అనేక మార్పులు చేయ్యనున్నట్లు తెలుస్తోంది తాజాగా జూన్ 2023 సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పాస్ మరియు ఫెయిల్ అయిన విద్యార్ధుల తదుపరి సంవత్సరం జాయినింగ్ డేటా ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకూ ప్రభుత్వం వద్ద పదవ తరగతి చదివి పాస్ అయ్యి ఆపై చదువులు చదువుకునే వారి డేటా మాత్రమె లబ్యమయ్యేది. పదోవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధుల డేటా పూర్తి స్థాయిలో లేకపోవడంతో విద్యార్ధులు ఏమిచేస్తున్నారు అనే డేటా లేకపోవడంతో వారిపై ప్రభుత్వం సరైన ద్రుష్టి సారించలేకపోయేది. అయితే ఇప్పుడు వీరిపై ప్రత్యెక ద్రుష్టి సారించి వీరిని చదువు మానకుండా ఉండేందుకు మరియు రాష్ట్రంలో నిరక్షారాస్యత పెరగకుండా ఉందేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకూ రాష్ట్రంలో పదవ తరగతి చదువుతున్న విదార్దుల వివరాలు Child Info website లో ప్రతీ విదార్ది వివరాలను కూడా స్కూల్ స్టాఫ్ ఈ వెబ్సైటు లో అప్లోడ్ చేసేవారు అయితే అన్ని రాష్ట్రాలకూ కలిపి ఈ వెబ్సైటు రన్ అవ్వడంతో పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యేవి దీనితో విద్యార్ధుల వివరాలను సరిగ్గా ట్రాక్ చెయ్యలేకపోయేవారు అధికారులు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం Child Info website నుండి Studentinfo.ap.gov.in (EMS) మార్చడంతో పోర్టల్ లోకి ఏపీ కి చెందిన స్టూడెంట్స్ డేటా అప్లోడ్ చెయ్యమని అధికారులు ఆదేసించినట్లు తెలుస్తోంది.
అంటే ఇప్పుడు పదవ తరగతి పాస్ అయిన విద్యార్ధులు ఏదైనా ఇంటర్ లేదా వేరే ఇతర గ్రూప్ లలో జాయిన్ అయిన తరువాత ముందుగా పాస్ అయిన విద్యార్ధుల డేటాను ఈ Studentinfo.ap.gov.in (EMS) ఆయా కాలేజీల్ స్టూడెంట్ ఆధార నెంబర్ ఆధారంగా వీరి డేటా ఎన్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఏపీ లోని ప్రతీ ఇంటర్ కాలేజ్ ను ఈ డేటా ఎన్రోల్ పూర్తి చెయ్యాలని విద్యాశాఖ అదేసించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రక్రియ పూర్తి అయితే పదవ తరగతి పాస్ అయ్యి కాలేజ్ కి ఎంతమంది విదార్ధులు వెళుతున్నారు, పాస్ అయ్యి ఎంతమంది చదువు ఆపేశారు, మరియు పదవ తరగతి పెయిల్ అయిన వాళ్ళు ఎంత మంది వంటి మొత్తం డేటా ఈ వెబ్సైటు లో కనిపిస్తుంది. దీంతో రాష్ట్రంలో డ్రాప్ అవుట్ విదార్ధులను మళ్ళీ కాలేజ్ కు పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పదవ తరగతి మాత్రమె కాకుండా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్ధులను ఫెయిల్ ఆయన సబ్జెక్టుల కొరకు కాలేజ్ కి వచ్చి చదువుకోనేందుకు తిరిగి కాలేజ్ లో రి-అడ్మిషన్ క్రింద వాళ్ళను జాయిన్ చేసుకోవాలని విద్యామండలి ఆదేశించింది. అయితే ఇంటర్ రెండు సంవత్సరాలు చదివి ఫెయిల్ అయ్యి రి-అడ్మిషన్ గా మళ్ళీ జాయిన్ అయిన విద్యార్ధులకు కూడా అమ్మవోడి ఇచ్చేందుకు ప్రభుతం ఉన్నతాదికారుల నుండి సమాచారం కోరినట్లు తెలుస్తోంది.