తండ్రి అంత్యక్రియలకు వెళ్ళని సీఎం యోగి ఆదిత్యనాద్ .. నెటిజన్ల జేజేలు

0
157
Yogi Adityanath father passed away
Yogi Adityanath father passed away

కరోనా వల్ల ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోయారు. తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు, పనికోసం వెళ్లి ఇరుక్కుపోయిన కూలీలు. చనిపోయిన వారిని చివరి చూపు చూసుకోవడానికి లేకుండా చేస్తూ ఎన్నో హృదయవిదారక ఘటనలను మిగులుస్తోంది ఈ కరోనా.

దేశ క్షేమం కోసం తండ్రిని కడసారి చూపు చూసుకునే అవకాశాన్ని కూడా త్యాగం చేశారు యూపీ సీఎం యోగి. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో పవర్స్ ఉంటే విచ్చలవిడిగా వాడుకునే ఈ రోజుల్లో ఇలాంటి సీఎం ఉండటం చాలా గొప్ప అని నెటిజన్లు జేజేలు కొడుతున్నారు.

తన తండ్రి మరణం తీవ్ర బాధను నింపిందని లాక్ డౌన్ నేపథ్యంలో రేపు జరగబోయే అంత్యక్రియలకు హాజరు కాలేనని యోగి ఆదిత్యనాధ్ స్పష్టం చేశారు ఇలాంటి అనుభవమే యూపీ సీఎం​ కి ఎదురైంది.

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్​ బిష్ట్​ మృతి చెందారు.దేశం మొత్తం లాక్​డౌన్​ నడుస్తున్న నేపథ్యంలో కన్నతండ్రిని చివరి చూపు చూసుకోలేకపోతున్నాని ఆయన తెలిపారు. రేపు జరగనున్న అంత్యక్రియలకు హాజరుకాలేనని ప్రకటించారు. ఆదిత్యనాధ్ తండ్రి ఆనంద్​ బిష్ట్​  పేగు, లివర్, ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఈ రోజు ఉదయం 10:40 నిమిషాలకు లఖ్​నవూ ఎయిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.