గురువారం, జూన్ 8, 2023
Homeరాజకీయంకాపు రిజర్వేషన్ ను పక్కదోవ పట్టించడానికే ఈ కాపు నేస్తం...పవన్ కళ్యాణ్

కాపు రిజర్వేషన్ ను పక్కదోవ పట్టించడానికే ఈ కాపు నేస్తం…పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాపు నేస్తం పథకం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వం పై సంచలనం వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ గురించి అసలు కాపులు డిమాండ్ చేయకుండానే వైసీపీ కాపులను మోసం చేయడానికి కొత్త ఎత్తుగడ వేసిందన్నారు. కాపుల రిజర్వేషన్ ఉద్యమాన్ని  వైసీపీ పక్కదోవ పట్టించేందుకు కాపు నేస్తం తెరపైకి తీసుకొచ్చిందన్నారు.

ఎలక్షన్ కి ముందు టీడీపీ వెయ్యి కోట్లు ఇస్తుంటే నేను రెండు వేల కోట్లు ఇస్తానన్న లెక్కలు బయటికి తీయాలన్నారు. కాపులకు ఇప్పటివరకూ ఇచ్చిన దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. రిజర్వేషన్ లు సైతం తుంగలో తొక్కారని మండిపడ్డారు. వైసీపీ ప్రవేశపెట్టే పథకాలకు కాపులకే అన్నట్లుగా నమ్మిస్తుందని అన్నారు. వెనుకబడిన వర్గాల వారిని ఆదుకోవాలని,  వారికి రిజర్వేషన్ కల్పించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular