గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeరాజకీయంఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టులో కేసు నమోదు.

ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టులో కేసు నమోదు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపద్యంలో రాష్ట్రం లో కూడా గ్రీన్ జోన్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు అయితే వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే లు మాత్రం లాక్ డౌన్ నిభందనలను  ఉల్లంగించి బయట తిరగడంపై కిషోర్ బాబు అనే వ్యక్తి హైకోర్టులో ఎమ్మెల్యే రోజా, సంజీవయ్య, విడదల రజని, మధుసూదన్ రెడ్డి, వెంకట గౌడ లను ఉద్దేశించి ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారని, చాలా చోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తిరుగుతున్నారని అయితే వీరిపై ఎలాంటి చర్యలూ తెసుకోలేదని హైకోర్టులో ఫిటిషన్ వేసారూ.

అయితే దీనిపై వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వాన్ని వారంలోగా  కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. లాక్ డౌన్ లో ఎమ్మెల్యేలు బయటకు రావడానికి గల కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించింది. అంతే కాక పిటిషనర్ బయట తిరిగిన ఎమ్మెల్యేలకు కరోనా టెస్ట్ మరియు క్వారంటైన్ వంటివి నిర్వహించారా అని పిటిషన్లో తెలపడంతో హైకోర్టు ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలు తెలపాలంటూ డీజీపీ ని కోరింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular