బుధవారం, జూలై 17, 2024
Homeరాజకీయంవైసీపీ కి గుడ్బై చెప్పి టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ కి గుడ్బై చెప్పి టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ అధినేత జగన్ కు మరోసారి భారీ షాక్ తగిలింది ఇప్పటికే తనపై నిఘా పెట్టారనే కారణంగా వైసీపీ పార్టీ పై మీడియా సమక్షంలో సంచలన కామెంట్స్ చేస్తూ చాలా కాలంగా ఆ పార్టీ నుండి దూరంగా ఉంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే ఇదే బాటలో నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అద్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి వైసీపీ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారనే కారణంతో ఆయన్ను వైసీపీ అధిష్టానం తొలగించింది.

దీనితో ఆపార్టీని వీడి టీడీపీ లో చేరనున్నారు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కంటే ముందు ఆయన సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ నెల 24న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరనుండడంతో ఎన్నికలకు ముందు ఒక్కసారిగా నెల్లూరు రాజకీయాలు చర్చనీయాంసంగా మారాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular