గురువారం, మార్చి 28, 2024
Homeరాజకీయంలాక్ డౌన్ లో ప్రభుతం ఇచ్చిన డబ్బుతో ఓటర్లను ఆకర్షిస్తున్న నాయకులు

లాక్ డౌన్ లో ప్రభుతం ఇచ్చిన డబ్బుతో ఓటర్లను ఆకర్షిస్తున్న నాయకులు

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రస్తుతం ఏపీ లోని స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా రాష్ట్రం మొత్తం​ లాక్ డౌన్​ నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులతో పాటు వెయ్యి రూపాయల నగదు పంపిణీ చేస్తున్నట్టు తెలిపింది.

అన్నట్టుగానే వీరికి 1000 రూపాయలు పంపిణీ మొదలు పెట్టారు దీనిలో విచిత్రం ఏమిటని అనుకుంటున్నారా చాలా చోట్ల ఈ డబ్బులు పంచింది వైకాపా కార్యకర్తలే సాదారణంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించే డబ్బు పార్టీ కార్యకర్తలు పంచడం చట్టరీత్యా నేరం దీనిపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి.

ఒక్కోచోట గ్రామ సచివాలయ అధికారులు పంచుతుంటే వైకాపా కార్యకర్తలు వైసీపీ పార్టీకి వోటు వెయ్యాలని కోరడంతో ఇప్పుడీ విషయం  స్థానికంగా పలు విమర్సలకు దారితీసింది. కొన్నిచోట్ల ఈ డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇంచ్చిందని, మీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రచారం ఎలా చేస్తారని వాగ్వాదానికి దిగారు.

లాక్ డౌన్ సమయంలో ఇలా జనం మొత్తం ఒక్కసారిగా  వచ్చి నిబంధనలకు విరుద్దంగా డబ్బులు పంచడం పై పలు విమర్సలొస్తున్నాయి. చాలా చోట్ల వాలంటీర్లు డబ్బులు పంచే డివైజ్ ల సర్వర్ మొరాయించడంతో అక్కడ స్థానిక అభ్యర్దులు డబ్బులు పంచారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular