రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే మాలక్ష్యం : మంత్రి కన్నబాబు

0
173
ap agriculture minister kanna babu
ap agriculture minister kanna babuap agriculture minister kanna babu

లాక్ డౌన్ నేపథ్యంలో జనసంచారంతో పాటు రవాణా కూడా ఎక్కడికక్కడ స్తంభించడంతో రైతులు భయపడుతున్నారు. ప్రస్తుతం పంటచేతికొస్తున్న టైం కావడంతో రేట్లు ధాన్యం రవాణాపై లాక్ డౌన్ ప్రభావం పడుతుందేమో అని అనుకుంటున్న తరుణంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతుల గురించి మాట్లాడారు. 

ఎట్టి పరిస్థితుల్లో రైతులు పండించిన పంట నష్టపోకూడదని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారని  కన్నబాబు అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నామని వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. దింతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్లకు పంపే ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేస్తుందని  తెలిపారు. వ్యవసాయ రంగాలపై రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నామని  ఎప్పటికప్పుడు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు డేటా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

ఇక అరటి పంటల విషయానికొస్తే ఆ రైతులు ఓడిదుడుకుల్లో  ఉన్న మాట నిజమేనన్నారు మంత్రి కన్నబాబు. రోజుకు 2 వేల టన్నులు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. వీటికోసం ఇతర రాష్ట్రాల నుంచి గొనే సంచులు దిగుమతి కావాల్సి ఉందని అన్నారు. ఇక  సమస్యల పరిష్కారానికి సంబంధించి 1902, 1907 టోల్‌ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు.