శనివారం, జూలై 27, 2024
Homeఅంతర్జాతీయంఅసలు సమస్య ముందుది.. ! WHO హెచ్చరిక

అసలు సమస్య ముందుది.. ! WHO హెచ్చరిక

కరోనాను అరికట్టేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం  సడలింపులతో కొన్ని లాక్ డౌన్ ఎత్తేస్తూ మరికొన్ని దేశాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీచేసింది.

అసలైన సవాళ్లు ముందున్నాయని లాక్ డౌన్స్ ఎత్తెయ్యడం తో సమస్య తీరిపోయిందనుకోవద్దని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది. 1918 లో స్పానిష్ ఫ్లూ 10 కోట్లమందిని బలిగొన్న సంఘటనను గుర్తు చేసుకుంటూ డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జెనరల్ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయెసస్‌ హెచ్చరించారు.

కరోనా కూడా ప్రమాద కరమైనదేనని కాకపోతే ఇప్పుడున్న సాంకేతికతతో దాన్ని సమర్ధంగా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు యావత్‌ ప్రపంచం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

ప్రస్తుతం ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో వైరస్ ప్రభావం దాని తీవ్రతా ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అసలు సమస్యను ప్రపంచం ఇంకా ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular