శనివారం, జూలై 27, 2024
Homeటెక్నాలజీWhatsApp New Update: అదిరిపోయే అప్డేట్స్ తీసుకు వచ్చిన వాట్సాప్

WhatsApp New Update: అదిరిపోయే అప్డేట్స్ తీసుకు వచ్చిన వాట్సాప్

ప్రముఖ సోషల్ మీడియా మెస్సెంజర్ వాట్సాప్ కొత్తగా పలు ఫ్యూచర్లను తీసుకు వచ్చింది. వీటిలో మొదటిది ఇకపై చాట్ బాక్స్ లో టెక్స్ట్ తో పాటు వీడియోలను లేదా ఫోటోలను పంపుకునే విదంగా కొత్త అప్డేట్ తీసుకువచ్చింది. అయితే ఈ అప్డేట్ ఇంతకు మునుపే ఉంది కదా అనుకుంటున్నారా నిజమే ఈ అప్డేట్ ఇదివరకే ఉంది అయితే పూర్వం ఏదైనా వీడియో గాని ఇమేజ్ గాని వాట్సాప్ లో ఫ్రెండ్స్ కి గాని ఏదైనా గ్రూప్ లో గాని పోస్ట్ చెయ్యాలంటే ముందుగా మొబైల్ కెమేరా తో లేదా వాట్సాప్ యాప్ లో ఉన్న కెమేరా ఆప్షన్ పై క్లిక్ చేసి దానిని ఫోన్ గేలరీ లో సేవ్ అయ్యాక మాత్రమే ఫ్రెండ్స్ కి గాని గ్రౌప్స్ లో గాని అప్లోడ్ అయేది.

ఇక పై ఇంత ప్రోసెస్ లేకుండా వాట్సాప్ టెక్స్ట్ టైప్ చేసేటప్పుడే వాట్సాప్ కెమేరా ఆన్చేసి డైరెక్ట్ గా ఫోటో గాని వీడియో గాని రికార్డ్ చేసి రికార్డ్ చేసిన విడియోని అక్కడినుంచే వెంటనే షేర్ చేసుకోవచ్చు దీనితో ప్రతీసారి ఫోన్ నుండి వాట్సాప్ లోకి వీడియోని ట్రాన్స్ఫర్ చేయ్యసిన పని ఉండదు. అంతే కాక వాట్సాప్ తన నేవిగేషన్ ను కూడా చాలా కాలం తరువాత మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ నేవిగేషన్ బార్ టాప్ లో ఉండగా తాజాగా తీసుకువచ్చిన అప్డేట్ లో నేవిగేషన్ బార్ బోటెంలోకి తీసుకు వచ్చింది వాట్సాప్.

అంతేకాక ఇప్పటివరకూ ఒక ఫోటో ఉ షేర్ చెయ్యాలంటే ఫోటో కి రైట్ సైడ్ ఉండే షేర్ బటన్ పై క్లిక్ చేసి షేర్ చేసేవారు అయితే తాజాగా వాట్సాప్ షేర్ చేసేటప్పుడే కొత్త గ్రూప్ గాని కొత్త కాంటాక్ట్ గాని యాడ్ చేసి యాడ్ చేసిన గ్రూప్ కి డైరెక్ట్ గా ఇమేజెస్ షేర్ చేసుకోవచ్చు. అంతేకాక ఇప్పటి వరకూ వాట్సాప్ లో కాంటాక్ట్ సేవ్ చెయ్యకుండా ఫోన్ గాని చాటింగ్ వంటివి చెయ్యడం కుదిరేవికాదు.

తాజా అప్డేట్ లో టాప్ లో ఉన్న సెర్చ్ బార్ లో కాంటాక్ట్ నెంబర్ టైప్ చెయ్యగానే ఆ నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది. దాని ఎదురుగా చాట్ అనే బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి చాట్ లేదా ఫోన్ కాల్ చేసుకోవచ్చు దీనితో అన్ని ఫోన్ నెంబర్లు ఫోన్ లో సేవ్ చెయ్యాల్సిన అవసరం ఉండదు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular