శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeహెల్త్7 రోజుల ఫ్లాట్ బెల్లీ డైట్ - పర్ఫెక్ట్ గా బరువు తగ్గడానికి చిట్కాలు

7 రోజుల ఫ్లాట్ బెల్లీ డైట్ – పర్ఫెక్ట్ గా బరువు తగ్గడానికి చిట్కాలు

7 రోజుల్లో బరువు తగ్గడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఈ డైట్ ప్లాన్ ఒకసారి ప్రయత్నించి చూడండి. వారం రోజుల తర్వాత తప్పక మార్పును గమనిస్తారు.

మీ శరీరం నుండి స్క్రాప్ ని తీసివేయండి.  స్క్రాప్ అంటే మీ శరీరం లో ని పనికిరాని ఆహరం. దాన్ని తీసివేయడం వల్ల కొంతవరకు పొట్ట తగ్గే అవకాశం ఉంది.

అల్పాహారాన్ని మానకూడదు.

మనందరికీ బ్రేక్ ఫాస్ట్ యొక్క ప్రత్యేకత బాగా తెలుసు. ఈ బ్రేక్ ఫాస్ట్ ను మనం లేచిన గంటలోపే తినేయాలి. అలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

రాత్రి 8 తర్వాత తినడం మానుకోండి.

మనం తినే భోజనం చాలా తేలికగా ఉండాలి. అప్పుడే మన జీర్ణ వ్యవస్థ కూడా తేలికగా జరిగుతుంది. అలా జరగాలి అంటే మన భోజనం రాత్రి ఎనిమిది లోపే తినేయాలి..

వారం రోజులు పాటించే డైట్ లో ఏది తినాలో ఏం తినకూడదో ఇప్పుడు చూద్దాం.

బయట డ్రింక్ తాగడం మానేయాలి దానివల్ల పొట్ట బాగా పెరుగుతుంది. బయట డ్రింక్స్ కి  బదులుగా గ్రీన్ టీ తాగుతూ ఉండాలి. కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి అవి మన డైట్ ప్లాన్ లో తప్పనిసరిగా ఉండాలి. వాటిని పచ్చిగా తినడం కన్నా వండిన తర్వాత తినడం చాలా మంచిది. ఇకపోతే ఉప్పు తక్కువగా తినాలి. ఉప్పు ఎక్కువగా తినటం వల్ల బాడీలో ఫ్యాట్ కంటెంట్ కూడా పెరుగుతుంది.

మన బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. అలా ఉండాలి అంటే రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. ఎక్కువగా డ్రైఫ్రూట్స్ తింటూ ఉండాలి దాని వల్ల మన బాడీ కి కావాల్సిన న్యూట్రియంట్స్ బాగా అందుతాయి.

ఫైబర్ కంటెంట్ కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకి ఓట్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల పొట్ట కూడా రాదు. ఇది జీర్ణక్రియను కూడా సులభం చేస్తుంది.

ఇప్పుడు చెప్పుకున్న డైట్ ప్లాన్ ను క్రమం తప్పకుండా వారం రోజులపాటు పాటిస్తే, తప్పకుండా మార్పులు కనిపిస్తాయి……

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular