మంగళవారం, మార్చి 19, 2024
Homeహెల్త్వేగంగా బరువు తగ్గడం ఎలా ? | Weight Loss Tips in Telugu

వేగంగా బరువు తగ్గడం ఎలా ? | Weight Loss Tips in Telugu

Weight Loss Tips in Telugu

ప్రతీరోజూ మనం తినే ఆహారాన్ని మరియు మన జీవన శైలిని బట్టి చాలా మంది అధిక బరువు, ఊబకాయం వంటి అనేక  సమస్య తో బాధపడుతూ ఉంటారు. 

అయితే బరువు ఎలా తగ్గాలో తెలియక చాలా ఆందోళన పడుతూ ఉన్న ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటారు  అటువంటి వారి కోసం నేడు బరువు తగ్గడం ఎలా మరియు పాటించాల్సిన పద్దతులు ఏమిటి  అన్నదాని గురించి తెలిసుకుందాం.

అయితే బరువు తగ్గడం మరియు  పెరగడం అనేది మనం తీసుకునే ఆహారం మరియు మన జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడు మనం చెప్పుకునే డైట్ యొక్క ఉపయోగాలు ఏమిటో చూద్దాం. అసలు ఈ డైట్ మీ ఆకలిని గణనీయంగా తగ్గిస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి కారణం అవుతుంది అదే సమయంలో మీ శరీరంలోని జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

1. పిండి పదార్థాలు తినడం తగ్గించాలి

 మీ ఆహారంలో నుండి చక్కెరలు మరియు పిండి పదార్థాలను తొలగించడం వల్ల మీకు  తరుచూ ఆకలి బాగా  తగ్గుతుంది దాని వల్ల ఆహరం మీద ఆసక్తి తగ్గుతుంది. అంతే కాక మీ శరీరంలోని  ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు ఎక్కువ  ఆకలితో బాధపడకుండా బరువు తగ్గటంలో  ఉపకరిస్తుంది.

 2. Protein and Fat కలిగిన కూరగాయలను తినాలి

  • ఆరోగ్యకరమైన ప్రోటీన్ వనరులు:-

మాంసం, గుడ్లు , చేపలు,  సాల్మన్, ట్రౌట్ మరియు రొయ్యలు.

  •  Best Protein Plant Based Food:-

బీన్స్, చిక్కుళ్ళు మరియు సోయా.

  •  ఆరోగ్యకరమైన కూరగాయలు:-

  * టొమాటోలు                * క్యాబేజీ

* బచ్చల కూర               * పాల కూర  

* కాలీఫ్లవర్                   * దోసకాయ

* కాలే                          * బ్రోకలీ

  •    Fat కలిగిన ఆహరం:-

* ఆలివ్ నూనె

* కొబ్బరి నూనే

* అవోకాడో నూనె

* వెన్న

పైన తెలిపిన వాటిలో  ప్రోటీన్స్ , ఫ్యాట్స్ మరియు తక్కువ కార్బ్ కలిగిన ఆహరం తీసుకోవటం వల్ల మీ బరువు తగ్గి కొలెస్ట్రాల్  కంట్రోల్ లో ఉండటంలో సహాయపడుతుంది.

   3. వారానికి మూడు సార్లు Weight ఎత్తండి

వెయిట్ లిఫ్టింగ్ వంటి రెసిస్టెన్స్ పవర్ పెంచే వ్యాయామాలు  ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకవేళ వెయిట్ లిఫ్టింగ్ సాధ్యం కాకపోతే, కార్డియో వర్కౌట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.

ఇప్పుడు చెప్పుకున్నవన్నీ క్రమం తప్పకుండ పాటించడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. అధిక బరువు తో బాధపడేవాళ్లు వీటిని తప్పక పాటించండి కత్చితంగా మార్పులు గమనిస్తారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular