శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeజాతీయంకరోనా కి వ్యాక్సిన్ కనిపెడుతున్నాం

కరోనా కి వ్యాక్సిన్ కనిపెడుతున్నాం

ఏ దేశంలో చూసినా కరోనా వల్ల బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది కొన్ని దేశాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది శవాలను పూడ్చటానికి అవస్థలుపడే పరిస్థితి. ఇలా తన విలయతాండకంతో ప్రపంచాన్ని వణికిస్తూ మరణ మ్రుదంగం మోగిస్తున్న కోవిడ్19 పై యావత్ ప్రపంచం కలిసి పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే కొవిడ్ 19 కు టీకాను అభివృద్ది చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు చేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తెలిపింది.

కరోప్లూ అనే పేరుతో ఈ వాక్సిన్ ఆవిష్కరించే ప్రక్రియలో తమతో పాటు అమెరికాలోని “యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్” శాస్త్రవేత్తలు టీకా కంపెనీ అయిన “ఫ్లూజెన్” తమతో కలిసిపనిచేస్తోనట్టు ఈ మేరకు ఒక అంతర్జాతీయ భాగస్వామ్యం కుదిరినట్టు శుక్రవారం ఇక్కడ తెలియజేసింది.

ఈ వ్యక్సిన్ ని ముక్కుద్వారా ఇచ్చేలా “ఇంట్రానాసల్ వాక్సిన్” గా దీన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్లూజన్ కు చెందిన ఎం2 ఎస్ ఆర్ అనే ప్రయోగాత్మక ప్లూ టీకా ఆధారంగా కరోనా వాక్సిన్ ను అభివ్రుద్ధి చేసేందుకు భారత్ బయెటెక్ ఇంటర్నేషనల్ కసరత్తు చేస్తోంది.

యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ శాస్త్రవేత్తలు ఫ్లూజన్ సహా వ్యవస్థాపకులైన యోషిహరో కవోక, గబ్రియేట్ నూమాన్ ,ఎం2 ఎస్ ఆర్ స్రుష్టికర్తలు. ఈ టీకాకు వ్యాధిరాకుండా ఎదుర్కొనే శక్తి ఉన్నట్లు నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో కొవిడ్ 19 లో ఉండే నావెల్ కరోనా వైరస్ ను ఎం2 ఎస్ ఆర్ లోకి ప్రవేశపెట్టి దాన్ని కరోనా వైరస్ వ్యాధిని అదుపు చేసే వ్యాక్సిన్ గా తయారు చేయబోతున్నారని తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular