మంగళవారం, జూన్ 18, 2024
Homeక్రీడలుమాలో ఎవరు బాగున్నారు వార్నర్ కొత్త ఛాలెంజ్..!

మాలో ఎవరు బాగున్నారు వార్నర్ కొత్త ఛాలెంజ్..!

టిక్ టాక్ ఈ యాప్ వచ్చాక సామాన్యులు కూడా సినిమా నటులకు ఏమాత్రం తీసిపోకుండా తమ నటనను ప్రపంచానికి చూపిస్తూ వాళ్ళతో పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల నుంచి ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్ మ్యాన్ డేవిడ్‌ వార్నర్‌ సోషల్ మీడియాలో తెలుగు సినీ హీరోలను ఫాలో అవుతూ వాళ్ళ నటనను ఇమిటేట్ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నాడు.

ఇటీవల బుట్టబొమ్మా బుట్టబొమ్మా అంటూ బన్నిపాటకి స్టెప్పులేయడం మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్‌, ప్రిన్స్ మహేశ్ బాబుల డైలాగ్స్​ని తనస్టైల్ లో భలే పలుకుతూ క్రికెట్ అభిమానులతో పాటూ సినీ అభిమానులను అలరిస్తున్నాడు వార్నర్. బాహుబలి లో రెబల్ స్టార్ ప్రభాస్ డైలాగ్ కూడా చెప్పి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. తాజాగా ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ చిత్రంలో  ఫొటోను తన ఫొటో ను పక్కపక్కన జతచేసి తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టుచేశాడు.

అంతేకాదండోయ్ ఆ ఫొటోకు “మాలో ఎవరి దుస్తులు మీరు ఎంచుకుంటారు..” అంటూ క్యాప్షన్ యాడ్ చేసాడు  వార్నర్. ఈ ఫొటో చూసి నెటిజన్లు కామెంట్లు మొదలుపెట్టారు వార్నర్ నువ్వు అచ్చం దేవేంద్ర బాహుబలిలా ఉన్నావు అని ఒకరు అంటుంటే ఇంకొందరు  “ఆస్ట్రేలియన్‌ బాహుబలి డేవిడ్‌బాయ్‌” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఏదిఏమైతేనేం మొత్తం మీద ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలుగు చిత్రసీమ నటులను ఫాలో అవుతూ వాళ్ళ నటనను అనుసరించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాడు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular