మంగళవారం, జూన్ 18, 2024
Homeజాతీయం86 లక్షల విలువైన వాడేసిన మాస్కులు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు

86 లక్షల విలువైన వాడేసిన మాస్కులు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు

ఓపక్క కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వాలు ఆ మహమ్మారి కట్టడి ఎలా అంటూ తర్జనభర్జ పడుతున్నారు. అయితే ఈ సమయాన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు కొందరు అక్రమార్కులు. మరీ నీచ స్థితికి దిగజారుతున్నారు. కరోనా వ్యాప్తిని నిర్ములించేందుకు ప్రభుత్వాలు మాస్కులు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇదే అదునుగా చేసుకుని డబ్బు మీద ఆశతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రలో కొందరు నీచులు వాడిపారేసిన మాస్కులను సేకరించి వాటిని ఉతికి ఆరేసి మరలా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలాంటి తప్పుడు పనులు చేసినందుకు ఈ కేసులో గతవారమే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి ​ తీసుకున్నారు. వాళ్ళనుంచి రూ. 71.86 లక్షల విలువైన మాస్కులను హేండోవర్ చేసుకున్నారు. కరోనా మహమ్మారి దరిచేరకూడదంటే మాస్కులు వేసుకోవడం మార్గం  దీన్ని డబ్బు సంపాదనకు అదునుగా  చేసుకుని మహారాష్ట్రలోని ముగ్గురు వ్యక్తులు.. వాడిపారేసిన మాస్కులను, విక్రయిస్తున్నారు. ఇలా విక్రయానికున్న వాటి విలువ రూ.71.86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఆ ముగ్గురూ వాడిపడేసిన మాస్కులను కొత్తవాటిలా చేయడంకోసం వాటిని ఉతికి, ఇస్త్రీచేసి మంచి బాక్సుల్లో ప్యాక్​చేసి వాటిని కొత్తమాస్కులుగా అమ్మకానికి తరలిస్తున్నారు. నాగరాజ్‌ పిళ్లై, రోహిత్ కొఠారి, మహమ్మద్‌ ఆలమ్​ అనే ముగ్గురి వద్ద రూ. 71 లక్షల విలువ చేసే మాస్కులను విరార్‌ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వారు స్పష్టం చేశారు. వీళ్ళు  సుమారు 25వేల మంది ఉపయోగించిన మాస్కులను  51.34 రూపాయల విలువగల మాస్కులు మల్లి తిరిగి ​మనకానికి పంపిస్తూ అడ్డంగా పోలీసుల చేతిలో బుక్కైయ్యారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular