ఆదివారం, మే 26, 2024
Homeఅంతర్జాతీయం4 బిలియన్ డాలర్లతో అమెరికా నుండి 31 MQ-9B డ్రోన్స్ భారత్ కొనుగోలు

4 బిలియన్ డాలర్లతో అమెరికా నుండి 31 MQ-9B డ్రోన్స్ భారత్ కొనుగోలు

భారత్ మరియు అమెరికా దేశాల మద్య గతంలో ఒక భారీ డీల్ జరిగిన విషయం తెలిసిందే అదే అమెరికాకు చెందిన MQ-9B డ్రోన్ డీల్ తాజాగా ఈ డీల్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ డీల్ ఇప్పుడు తెరపైకి రావడానికి ముఖ్య కారణం ఒక నేషనల్ మీడియా చేసిన ఫేక్ న్యూస్ వల్ల ఈ డ్రోన్ డీల్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

సదరు నేషనల్ మీడియా MQ-9B డ్రోన్ డీల్ ను అమెరికా నిలిపివేసిందంటూ తప్పుడు కధనాలు రాయడంతో ఈ కధనాలను మీడియా మరియు పలు యూట్యూబ్ చానెల్స్ ఇదే కరెక్ట్ అనుకుని పబ్లిష్ చేసాయి అయితే ఈ డీల్ పై ఫేక్ న్యూస్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఏకంగా అమెరికాకు చెందిన అంబాసిడర్ వివరణ ఇవ్వవలసి వచ్చింది.

తాజాగా ఒక నేషనల్ మీడియా రిపోర్టర్ యూఎస్ అంబాసిడర్ ని భారత్ మరియు యూఎస్ మద్య MQ-9B డ్రోన్ డీల్ ను యూఎస్ బ్లాక్ చేసిందంటూ వస్తున్న వార్తలపై మీ స్పందన ఏమిటని అడగగా ఈ డీల్ ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామంటూ చెప్పడంతో ఈ డ్రోన్ డీల్ పై ఒక క్లారిటీ వచ్చింది దీనితో సదరు మీడియా సంస్థ క్షమాపణలు చెప్పింది.

ఇక ఈ డీల్ విషయానికి వస్తే 31 MQ-9B డ్రోన్స్ ను భారత ప్రభుత్వం మరియు యూస్ కాంగ్రెస్ ప్రభుత్వాల మద్య జరిగే డ్రోన్ డీల్ ఇది రెండు ప్రభుత్వాల మద్య జరిగే ఈ డీల్ ను వచ్చే ఏడాది మార్చి లోగా పూర్తి చేసే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది.

MQ-9B డ్రోన్స్ కు హంటర్ కిల్లర్ డ్రోన్స్ గా పేరుంది వీటిని భారత్ -చైనా నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద నిఘా కోసం ఉపయోగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ డ్రోన్ డీల్ పై పలు రూమర్లు కూడా నడుస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఈ డీల్ కోసం భారత్ భారీ బడ్జెట్ ఖర్చు చెయ్యడమే ప్రధాన కారణం ఒక్క ఈ డ్రోన్ వేల్యూ సుమారు రక్షణశాఖ బడ్జెట్ లో ఏకంగా 5% గా ఉండడం ఇప్పుడు అందరి దృష్టీ ఈ డీల్ పైన్ ఉంది.

ఇక ఈ డ్రోన్స్ పనితీరు విషయానికి వస్తే హైయాటిట్యూడ్ లో ఎగిరే ఈ డ్రోన్స్ ఏకంగా 35 గంటలపాటు నిర్విరామంగా గాలిలోనే ఉంటూ నిఘా పెట్టగాలవు. అంతేకాక ఈ డ్రోన్స్ తో పాటు నాలుగు హెల్ ఫైర్ క్షిపణులను, సుమారు 450 కిలోల బాంబులను ఇవి మోసుకెలతాయి వీటిని కిల్లర్ డ్రోన్స్ గా పిలుస్తారు ఈ డ్రోన్ డీల్ పూర్తి అయితే వచ్చే ఏడాది మార్చి లోగా ఈ డ్రోన్స్ ను భారత్ కు అమెరికా సప్లై చేయ్యనుంది..

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular