గురువారం, ఫిబ్రవరి 22, 2024
Homeజాతీయంఉప్పాడ గోదావరి మధ్యలో ఒక అధ్బుతం..! రెండుగా చీలిన గోదావరి

ఉప్పాడ గోదావరి మధ్యలో ఒక అధ్బుతం..! రెండుగా చీలిన గోదావరి

మంచిర్యాల జిల్లా ఇందారం గోదావరి నది బ్రిడ్జి వద్ద గోదవరి విష జలాలతో రెండుగా చీలిపోయింది. సరిగ్గా నది మధ్యలో ఓ నురగ బాట ఏర్పడింది. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నురగ బాట ఏర్పడడంతో స్థానికులు వింతగా చూస్తున్నారు. విష జలాలతో ఏర్పడ్డ ఆ నురగ స్థానికుల్లో చర్చ నియంశంగా మారింది. విష తుల్యమైన జలాలను తనలో కలుపుకొని గోదావరి మధ్యలో నురగలుగా పారుతుంది.

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది లో ఒక వింత చోటుచేసుకుంది. ఏళ్ళం పల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో అధికారులు నీటిని దిగువ గోదావరి నది కి వదులుతున్నారు. దీంతో ఇందారాం వద్ద గోదావరి నది రెండు వైపులా ఒడ్డున తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే గోదావరి నది మధ్యలో  నురగ ఏర్పడి ప్రత్యక ఆకర్షణ గా ఏర్పడుతుంది.

అయితే నదిలో ఏర్పడ్డ ఈ వింత ను చూసేందుకు మంచిర్యాల జిల్లా ప్రజలతో పాటు పెద్దపల్లి నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. బ్రిడ్జి పైన వెళ్లే వాహనదారులు అగి మరి ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. స్థానికులు అధికారులకి సమాచారం ఇవడంతో ఆ ప్రాంత నది జలాలను  సేకరించి  పరీక్షకు పంపించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular