భారత్ చేతికి మరొక అతి పెద్ద డీల్.. బరాక్-8 మిస్సైల్ సిస్టం కొనుగోలు చేయనున్న దుబాయ్

బరాక్-8 మిస్సైల్

గత 10 రోజుల క్రితం యమెన్ రెబల్ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆర్ధిక రాజధాని అబుదాబి ఎయిర్ పోర్ట్ తో పాటు చమురు నిక్షేపాలు గల ప్రాంతంపై వరుస డ్రోన్ దాడులు చెయ్యడంతో ఇద్దరు ఇండియన్స్ తో పాటు మరో ముగ్గురు ఇతర దేశస్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఆర్దికంగా ఇంత బలంగా ఉన్న UAE కి అసలు దాడి జరుగుతుందన్న సమాచారమే తెలియలేదు దీనికి ప్రధాన కారణం ఆ దేశానికి అంత భారీ క్షిపణి రక్షణ వ్యవస్థ లేకపోవడమే. దీనితో ఒక్కసారిగా అప్రమత్తమైన UAE ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో భాగంగా అదునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ (Defence Sheild) ను కొనుగోలు చేయుటకు సిద్దం అయ్యింది.

ఈ విషయం పై ఇప్పటికే సౌత్ కొరియా తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే సౌత్ కొరియా అందించే మిస్సైల్ రేంజ్ 40 కిలోమీటర్లు మాత్రమె ఉండడం ఆ మిస్సైల్ వ్యవస్థ కూడా 2024 వరకూ లబించే అవకాసం లేకపోవడంతో UAE బరాక్-8 మిస్సైల్ కొనుగోలు చెయ్యాలని భావిస్తోంది దీనిలో భాగంగానే ఇప్పటికే ఇజ్రాయెల్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

బరాక్-8 మిస్సైల్ ను ఇండియా మరియు ఇజ్రాయెల్ దేశాలు కలిసి డెవలప్ చేయడంతో ఇది భారత్ కు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. బరాక్-8 మిస్సైల్ ను ఇప్పటికే భారత్ అప్గ్రేడ్ చేసి బరాక్-ER వెర్షన్ ను భారత్ డెవలప్ చేసింది.

బరాక్-8 మిసైల్ ద్వారా క్రూజ్ మిస్సైల్, యాంటీ షిప్ మిసైల్స్, డ్రోన్ లను గుర్తించి వాటిని మధ్యలోనే ద్వంసం చేస్తుంది దీనిని భూమి నుండి మరియు సముద్రం నుండి కూడా ప్రయోగించవచ్చు ఇప్పటికే పిలిఫీన్స్ కు బ్రహ్మోస్ మిస్సైల్ డీల్ కన్ఫర్మ్ అయిన నేపధ్యంలో బరాక్-8 డీల్ తో DRDO (డీ.ఆర్.డీ.వో) కు మరియు భారత్ రక్షణ రంగానికి వూతం దొరికినట్లు అవుతుంది. 

Read Also..తైవాన్ గగంతలలోకి ప్రవేసించిన చైనాకు చెందిన 39 యుద్ధ విమానాలు  

Read Also : BrahMos Supersonic Cruise Missile: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ పరీక్ష విజవంతం

       


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి