ఆదివారం, మే 26, 2024
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్ సైనికులని తరిమి..తరిమి కొట్టిన తాలిబాన్ ఫోర్స్..10 మంది మృతి

పాకిస్థాన్ సైనికులని తరిమి..తరిమి కొట్టిన తాలిబాన్ ఫోర్స్..10 మంది మృతి

పాకిస్థాన్ మరియు తెహ్రిక్ ఏ తాలిబాన్ కు చెందిన తాలిబాన్ల మద్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. నాలుగు లోజుల క్రితం పాకిస్థాన్ కు చెందిన ఆర్మీ సోల్జర్స్ నిమరోజ్ బోర్డర్ లో ఇనుప స్తంభాలు పాతడానికి ఇనుప కంచే వేస్తున్న తరుణంలో అక్కడికి వచ్చిన తెహ్రిక్ ఏ తాలిబాన్ కు చెందిన తాలిబాన్ సైన్యం దొరికిన వారిని దొరికినట్లు కాల్చి పడేసారు ఈ ఘటనలో సుమారు 10 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోగా 15 నుండి 20మంది వరకూ తీవ్ర గాయాలయ్యాయి.

మరికొంత మంది పాకిస్థాన్ సైనికులు తుపాకులు వదిలి అక్కడినుండి పారిపోయారు తాజాగా జరిగిన ఈ ఘటనతో పాకిస్థాన్ ప్రభుత్వం అవాక్కయ్యింది. అయితే పాకిస్థాన్ బోర్డర్ లో వేసిన కంచెను జేసీబీ లతో విరగ్గొట్టి వాటిని తొలగించారు తెహ్రిక్ ఏ తాలిబాన్ ఫోర్స్. గతం లోనే తెహ్రిక్ ఏ తాలిబాన్ మరియు పాకిస్థాన్ సైనుకుల మద్య ఇప్పటికే అనేక సార్లు కాల్పుల ఉల్లంగన కోసాగుతుండడంతో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు తెహ్రిక్ ఏ తాలిబాన్ కు చెందిన కమాండర్లతో శాంతి చర్చలు జరిపారు.

అయితే ఈ చర్చలు జరిపిన కొన్నాల్లకే తెహ్రిక్ ఏ తాలిబాన్ ఫోర్స్ చర్చలను ఉల్లంగిస్తూ ఇకపై పాకిస్థాన్ ఆర్మీ పై భారీ ఎటాక్ చేస్తామంటూ ప్రకటించింది. దీనితో రగిలిపోయిన పాకిస్థాన్ ఆర్మీ తెహ్రిక్ ఏ తాలిబాన్ కు చెందిన ఒక టాప్ కమాండర్ పై డ్రోన్ ఎటాక్ చెయ్యడానికి ప్రయత్నించి పాకిస్థాన్ ఆర్మీ డ్రోన్ ద్వారా AR Missile లాంచ్ చేసి తెహ్రిక్ ఏ తాలిబాన్ టాప్ కమాండర్ ఉన్న చోట ఫైర్ చెయ్యగా ఆ మిసైల్ కాస్తా దీపావళి సిసింద్రీ లాగా సీదేసింది.. అదేనండి మిసైల్ పేలలేదు.

 

pakistan drone
                               pakistan drone

అసలే పాకిస్థాన్ ప్రభుత్వం మరియు పాకిస్థాన్ సైన్యాన్ని ముచ్చెమటలు పట్టిస్తూ కోపంతో రగిలిపోతున్న ఆ కమాండర్ ఈ ఘటన జరగడంతో పాకిస్థాన్ ఆర్మీ పై ఒంటికాలిపై రగిలిపోతూ త్వరలో మా సత్తా మీకు చూపిస్తామంటూ..బూడిద చేస్తామంటూ పాకిస్థాన్ ఆర్మీకి చాలెంజ్ విసిరాడు.

ఈ ఎటాక్ జరిగిన నాలుగు రోజుల్లోనే సుమారు 10మంది పాకిస్థాన్ ఆర్మీ సైనికులు ను బోర్డర్ లో కాల్చి వేసారు. ఇందులో నవ్వు తెప్పించే విషయం ఏంటంటే తాజాగా పాకిస్థాన్ ఆర్మీ ప్రయోగించిన డ్రోన్ చైనాదని తాజా సమాచారం.

         

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular