ఆదివారం, మే 26, 2024
Homeభక్తిభాగ్యనగర వాసులకు టీటీడీ గుడ్ న్యూస్

భాగ్యనగర వాసులకు టీటీడీ గుడ్ న్యూస్

భాగ్యనగర వాసులకు టీటీడీ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎంతగానో ఇష్టమైన తిరుపతి  శ్రీవారి లడ్డూ ప్రసాదం రేపటి నుంచి హైదరాబాద్‌ లో ఉంటున్న బక్తులకు   అందుబాటులోకి రానుంది. లాక్ డౌన్ కారణంగా స్వామీ వారి దర్శనం లేక లాక్ డౌన్ తో  తిరుమల శ్రీవారి ఆలయం భక్తుల దర్శనాలను చాలా రోజులుగా నిలిపేసిన సంగతి తెలిసిందే.

అయితే కరోనా ఎఫ్ఫెక్ట్ తో  స్వామివారి ఆశీస్సులు లేకపోవడంతో ఇప్పుడు  ఆయన ప్రసాదం రూపంలో భక్తులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో టీటీడీ బోర్డు వారు రూ. 25కే ఒక లడ్డూను స్వామివారి  భక్తులకు ఇవ్వడం ప్రారంబించారు.

ఒక్క ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే కాక  తెలంగాణా  మరియు  పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులో నుండి వచ్చే బక్తులను దృష్టిలో పెట్టుకుని వారికి  సైతం లడ్డూ విక్రయాలు మొదలపెట్టనున్నారు.

అయితే దూర ప్రాంతాలైన  కర్నాటక, తమిళనాడు వాసులకు కూడా ఇది కొంత వరకూ స్వామివారి ఆశీస్సులు ఈ విదంగా నైనా పొందే అవకాశం కలుగుతుంది. ఇక బాగ్యనగరం  హైదరాబాద్ లో ఇప్పటికే 60వేల లడ్డూలు హైదరాబాద్ లో ఉన్న  బక్తులకు పంపించింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular