గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeభక్తిభక్తుల ఆగ్రహంతో శ్రీవారి భూములపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం ..

భక్తుల ఆగ్రహంతో శ్రీవారి భూములపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం ..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి పెద్దఎత్తున వ్యతిరేకత ఎదురైంది దీంతో సేవ్ టీటీడీ అంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. స్వామివారి భూములు అమ్మడానికి మీరెవరంటూ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున  విరుచుకుపడ్డారు భక్తులు.. ఇక ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం  ఆస్తులపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

భక్తులు స్వామివారికి చెల్లించుకున్న కానుకలను, ఆస్థులను ఎట్టిపరిస్థితులలో వాటి జోలికి వెళ్ళేపరిస్థితి గాని, వాటిని విక్రయించే ఆలోచనాకానీ  లేదని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై  టీటీడీ పాలకమండలిలో తీర్మానించినట్లు అయన తెలిపారు. తిరుమలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి తితిదే ఆస్తుల విక్రయాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టీటీడీ  ఆస్తులు విక్రయిస్తున్నారనే వాదనలపై  విచారణ జరిపించి ఈ విషప్రచారం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

ఇక రాబోయే  రోజుల్లో టీటీడీ  పాలకమండలి పై ఎవరైనా సరే  ఇటువంటి ఆరోపణలు చేయకుండా, సమగ్ర విచారణ జరిపించాల్సి న అవసరం ఉందని ఈ మేరకు  బోర్డు తీర్మానించిందని ఈ నేపథ్యంలో  ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేర్కొన్నారు. ఇక టీటీడీ అతిథి గృహాలను రూల్స్  కి విరుద్ధంగా కేటాయించలేదని తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు వాటికి తగ్గ  మార్గదర్శకాలు రూపొందించాలని తెలిపారు.

ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ఉన్న ‌నిబంధనలు సడలించిన తరువాతే స్వామివారి దర్శనాన్ని పునరుద్దరించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వై.వి.సుబ్బారెడ్డి తెలియజేసారు. భౌతికదూరం పాటించే విదంగా స్వామీ వారి  దర్శనాలకు అనుమతి ఇచ్చేందుకు తగు  చర్యలు తీసుకుంటున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular