గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeజాతీయంగుంటూరులో టోకరా.. 70 లక్షలతో ట్రక్ డ్రైవర్లు జంప్

గుంటూరులో టోకరా.. 70 లక్షలతో ట్రక్ డ్రైవర్లు జంప్

గుంటూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొందరు ట్రక్ డ్రైవర్లు  అతనికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఇటీవల రెండు ట్రక్కుల్లో మిర్చి లోడును మహారాష్ట్రలోని షోలాపూర్‌‌కు తీసుకెళ్లి అక్కడ అమ్మగా 70 లక్షల రూపాయల నగదు చేతికి వచ్చింది. ఆ డబ్బుపై ట్రక్ డ్రైవర్లు కన్నేశారు. వ్యాపారం పూర్తి అయ్యాకా 70 లక్షల నగదు తీసుకుని  ట్రక్కులో స్వగ్రామానికి బయలుదేరాడు.

సరిగ్గా మంగళవారం తెల్లవారు సమయంలో తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తారం దగ్గరకు రాగానే ఏడుకొండలు మూత్ర విసర్జన కోసం లారీ దిగగా  అదే అదునుగా భావించి ట్రక్కు డ్రైవర్లు తమవద్ద ఉన్న నగదుతో అక్కడినుండి పరారయ్యారు. చివరికి లబోదిబోమన్న వ్యాపారి  స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. హుటాహుటీన రంగంలోకి దిగిన పోలీసులు. తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్‌ దగ్గరలో ఆ దోపిడీదారుల ట్రక్ ను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు.

అయితే నిందితుల గురించి ఆరాతీయగా వాళ్ళు ఆ ట్రక్కు వదిలేసి  వేరొక ట్రక్కులో అక్కడి నుంచి పరారీ అయినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఐదు బృందాలుగా విడిపోయి వారిని గాలిస్తున్నారు. అయితే ఇదంతా ప్లానింగ్ ప్రకారమే జరిగుంటుందనేది పోలీసుల  అనుమానం. ఎందుకంటే కేటుగాళ్లు వాళ్ళ ఫోన్లు కూడా అదే ట్రక్ లోనే వదిలేసి వేరే ట్రక్కులో వెళ్లిపోయారు. దీనితో వాళ్ళు ఎటువైపు వేల్లరనేది  ట్రాక్ చెయ్యడం కూడా కష్టాంగా మారింది. ఒడిశాకు చెందిన లారీలు కాగా డ్రైవర్లు మాత్రం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. బాధితుడి నుంచి డ్రైవర్ల వివరాలు గుర్తులు మరియు ఫోటోలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular