శనివారం, మే 18, 2024
Homeజాతీయంపసిడి రేట్లు పైపైకి...తాజా రేట్లు ఇవే ..!

పసిడి రేట్లు పైపైకి…తాజా రేట్లు ఇవే ..!

లాక్ డౌన్ నడుస్తున్నా అమ్మకాలు లేకున్నా విలువైన లోహాల రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక బంగారం, వెండి ధరల విషయానికొస్తే రోజుకోరకంగా రేట్లు పెరుగుతూ పసిడి ప్రేమికులకు షాక్ ఇస్తున్నాయి. ప్రతిరోజూ ఎంతోకొంత పెరగడం తప్ప రేట్లలో తగ్గుదల ఎక్కడా ఉండకపోవడం విశేషం.. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా  బంగారం ధర తగ్గినా.  దేశీయ మార్కెట్‌లలో మాత్రం పసిడి విలువ ఎగబాకడం దీనిలో కొసమెరుపు. ఓ వైపు బంగారం ధర పెరిగితే ఇంకోవైపు వెండి ధర మరింత పైపైకి ఎగబాకుతుంది.

బాగ్యనగరం హైదరాబాద్ లో శనివారం బంగారం ధర మార్కెట్‌లో బాగా పెరిగింది. అయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 వరకూ పెరిగి మార్కెట్‌లో రూ.44,490కు చేరింది. అయితే  24 క్యారెట్లు గల బంగారం ధర అంతే స్థాయిలో పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,250కు ఎగసింది.  ఇక బంగారం ధరలతో  పాటు వెండి కూడా పెరిగింది. మార్కెట్లో కేజీ వెండి ధర రూ.1450 వరకూ పెరిగి  వెండి ధర రూ.43,500కు చేరుకుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్ కు 1.22 శాతం వరకూ దిగొచ్చింది. దీంతో ధర ఔన్స్ కు 1704.80 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గగా  వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ధర ఔన్స్ కు 1.09 శాతం పెరుగుదలతో 15.76 డాలర్లకు ఎగబాకింది.

ఇవన్నీ ఇలా ఉండగా దేశీయంగా బంగారం ధరలు ఇలా పెరగడానికి అనేక కారణాలే ఉన్నాయి. ప్రపంచ గ్లోబల్ మార్కెట్లో  పసిడి ధరల్లో మార్పు,  ద్రవ్యోల్బణం రేటు లో మార్పులు, ఇంకా ప్రజలు పసిడిపై పెట్టుబడులు పెరగడంతో పాటూ కొనుగోళ్లలో కూడా  మార్పు, కేంద్ర బ్యాంకుల్లో ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటి ఇలా పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular