శుక్రవారం, జూలై 26, 2024
Homeఅంతర్జాతీయంNepal Earthquake: నేపాల్ లో భూకంపం రెక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రత

Nepal Earthquake: నేపాల్ లో భూకంపం రెక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రత

నేపాల్ ను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. నవంబర్ 3 వ తేదీన జజార్ కోట్ లో ఈ బూకంప కేంద్రం సంబవించింది బూకంప తీవ్రత ఏకంగా 6.4 గా నమోదైంది. అయితే ఈ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంప తీవ్రత దాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.

ఈ భూకంప దాటికి 153 మంది మరణించగా ఈ మృతుల్లో జజార్ కోట్ కి చెందిన మిన్సిపాలితీ డిప్యుటీ మేయర్ సైతం ఉన్నారు. మొత్తం 153 మంది మరణించగా వీరిలో 78 మంది వరకూ పిల్లలు ఉండడం విచారకర విషయం.

అయితే ఈ ఘటనను మర్చిపోకముందే నేడు మరోసారి భూమి కంపించినట్లు తెలుస్తోంది. మక్వాన్పూర్ జిల్లా లోని చిట్లాంగ్ ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూకంపం నేటి తెల్లవారు 01: 20 కి సంభవించింది. భూకంప తీవ్రత 4.5 గా నమోదైనట్లు తెలుస్తోంది.

అయితే మరో చేదు వార్త ఏమిటంటే నేపాల్ లో ఇంతకన్నా పెద్ద భూకంపాలు మరిన్ని సంభవించే అవకాసం ఉందంటున్నారు నిపుణులు. అయితే ఇప్పటివరకూ ఈ భూకంప ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అయితే బారత్ నేపాల్ కి అండగా నిలిచింది భూకంప బాదితుల కోసం అత్యవసర మెడికర్ ఎక్యూప్మెంట్స్ తో పాటు
34టన్నుల ఎమర్జెన్సీ రిలీఫ్ మెటీరియల్స్ అందించింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular