గురువారం, మార్చి 23, 2023
HomeసినిమాBollywood News : వరుసగా మూడోరోజు మరొక నిర్మాత మృతి

Bollywood News : వరుసగా మూడోరోజు మరొక నిర్మాత మృతి

bollywood news బాలివుడ్ లో వరుసగా రెండు రోజులుగా ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ వంటి వారి మరణాలతో భాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక్కసారిగా ఒకరి తరువాత ఒకరు మరణించడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

వీటి నుండి కోలుకునే లోపు ఈ రోజు ప్రముఖ నిర్మాత గిల్డ్ ఆఫ్ సీఈవో కుల్మీట్ మక్కర్ మరణంతో ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. కుల్మీట్ మక్కర్ ఈ రోజు ఉదయం హార్ట్ఎటాక్ తో మరణించడంతో ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ తన ట్విట్టర్ లో కుల్మీట్ మృతిపట్ల ప్రగాడ సానుభూతి తెలిపారు.

రోహిత్ శెట్టి కూడా తన ట్విట్టర్ లో “ఇంకొక బ్యాడ్ న్యూస్ మనం వింటున్నాం”..బాలివుడ్ ఫిలిం ఇండస్టీ మళ్ళీ తిరిగి తీసుకురాలేని ఒక బలమైన వ్యక్తిని కోల్పాయిందంటూ తన ట్విట్టర్ లో తెలిపారు. అయితే ట్విట్టర్ వేదికగా పలువురు స్పందిస్తూ ప్రస్తుతం బాలివుడ్ కు బ్లాక్ డేస్ నడుస్తునాయని ఇది ఇక్కడితో ఆగిపోవాలని దేవుణ్ణి ప్రార్దిస్తున్నట్లు తెలిపారు.

కుల్మీట్ మక్కర్ భాలివుడ్ లో సుమారు 30 సంవత్సరాలుగా అనేక సంస్థల్లో చేసారు. లాక్ డౌన్ వళ్ల ఇబ్బంది పడుతున్న భాలివుడ్ ఆర్టిస్టులను ఆదుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటుకై ఎంతగానో కృషిచేసారు.

RELATED ARTICLES

Most Popular