శనివారం, జూలై 27, 2024
Homeఅంతర్జాతీయంభారత సైన్యంపై దాడికి తెగబడిన చైనా... ముగ్గురు భారతీయ జవాన్ల మృతి

భారత సైన్యంపై దాడికి తెగబడిన చైనా… ముగ్గురు భారతీయ జవాన్ల మృతి

భారత్-చైనా బోర్డర్ వివాదం చివరికి తారాస్థాయికి చేరింది. నిన్న రాత్రి నుండి లద్దాక్ గల్వాన్ వ్యాలీ వద్ద భారత్ చైనా ల మద్య సుమారు 3గంటలపాటు భారీస్థాయిలో ఘర్షణ జరగింది. దీనితో చైనా బలగాలు భారత్ జవాన్లపై రాళ్లతో దాడి చేయడంతో ఇద్దరు భారతీయ జవాన్లు, ఒక కమాండింగ్ ఆఫీసర్ అమరులయ్యారు. వీరిలో ఒకరు పంజాబ్ రెజిమెంట్ కు    చెందిన కల్నల్ కాగా మరొకరు  భీహార్ రెజిమెంట్ కి చెందిన జవాన్ గా  తెలుస్తుంది.

అయితే గత కొన్ని రోజులుగా చైనా బోర్డర్ వద్ద కపట నాటకాలు ఆడుతుంది ఒక వైపు చర్చలు జరుపుతున్నట్లు పైకి శాంతి మత్రం వల్లిస్తూ మరోవైపు రాత్రి సమయాలలో భారత భూబాగాన్ని అక్రమించే ప్రయత్నాలు చేస్తుంది. నిన్న కూడా ఇదే విదంగా రాత్రి సమయంలో ఆక్రమణకు ప్రయత్నించడంతో బారత జవాన్లు దీటుగా ఎదురించడంతో చైనా రాళ్లదాడికి  తెగబడింది.

గతం లోనూ చైనా భారత్ జవాన్లపై కర్రలకు ఫెన్సింగ్ వైర్ చుట్టి దానితో దాడి చేయడంతో నలుగురు జవాన్లు గాయపడిన ఘటన తెలిసిందే. అయితే భారత్ పై చైనా కాల్పులు జరపడంతో ముగ్గురు జవాన్లు చనిపోయారని వస్తున్న వార్తల పై ఎటువంటి ప్రకటన చేయలేదు.

అధికారులు మాత్రం రాళ్ళతో దాడి జరిగినట్లు మాత్రమె వెల్లడించారు. ప్రస్తుతం లద్దాక్ లో జరిగిన ఘటనపై రక్షణమంత్రి రాజ్ నాద్ సింగ్ చైనా దూకుడు మరియు బోర్డర్ పరిస్థితీపై సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, బిఫిన్ రావత్, విదేశాంగ శాకా మంత్రి జై శంకర్, నేవీ చీఫ్ అధికారులతో రాజ్ నాద్ సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సమావేశానికి ముఖ్య కారణం ప్రదానమంత్రి నరేంద్ర మోడీ లద్దాక్ లో జరిగిన గతనపై పూర్తి వివరాలు అర్జెంటుగా తమకు తెలపాలని సూచించారు. దీనిని బెట్టి చూస్తె చైనా కాల్పులకు తెగబడటంతో మోడీ ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది. ఈ విషయం పై భారత్ ఈ రోజు సాయంత్రం లోపు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular