గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeక్రీడలుధోనీ కూతురు జీవాను రేప్ చేస్తామంటూ బెదిరింపులు

ధోనీ కూతురు జీవాను రేప్ చేస్తామంటూ బెదిరింపులు

ఐపీఎల్ సీజన్  వచ్చినదంటే చాలు ప్రతీ ఇంటిలోనూ ఒక కొత్త సెలబ్రేషన్ లా ఉంటుంది. ఎందుకంటే మొత్తం క్రికెటర్లు ఒకే చోట ప్రత్యక్షమవ్వడం తో పాటు గ్రౌండ్ లో సిక్సర్లు బాదడం ఇదంతా ఒక కోలాహళంలా ఉంటుంది.  రాను రాను ఈ ఐపీఎల్ కొత్త పుంతలు తొక్కుతూ స్పోర్టీవ్ గా చూడాల్సిన ఆటను అదే ఒక జీవితంలో భాగం అనేలా వికృత చేష్టలకు దిగుతున్నారు.

నేడు ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కూతురు జీవా పై కొంతమంది అసభ్య కర రీతిలో తనను రేప్ చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా అత్యంత దారుణంగా బెదిరింపులకు దిగారు. దీనికి ప్రధాన కారణం ధోనీ సరిగ్గా ఆడడం లేదంటూ అందుకే జట్టు మ్యాచ్ ఓడిపోతుందంటూ సోషల్ మీడియాలో జీవా పై అసభ్య పదజాలంతో బెదిరించారు.

దీనితో ఈ విషయాన్ని గమనించిన జార్ఖండ్ ప్రభుత్వం ధోనీ కూతురు జీవా కు భద్రత పెంచింది. ఇండియన్ క్రికెను నేడు ఇలాంటి స్థానంలో నిలబెట్టిన ధోనీకి ప్రతిఫలంగా పశువులు కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక ధోనీ ఆట తీరును ప్రస్తావిస్తూ పచ్చి బూతులతో కామెంట్స్ చేస్తూ దూసించారు. ఇక ఈ ఐపీఎల్ పుణ్యామా అని నేడు ప్రతీ గ్రామంలో బెట్టింగ్లతో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular