గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeజాతీయంఇది యూపీ కూలీల దీన పరిస్థితి

ఇది యూపీ కూలీల దీన పరిస్థితి

కరోనా వల్ల వలస కూలీలు పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇక పట్టణాల్లో పనుల్లేక ఉండటానికి గూడులేక సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నంలో దిక్కుతోచక కాలినడకనే వందల కిలోమీటర్లు వెళుతున్న పరిస్థితులు తలెత్తాయి.

అయితే ఈ వలస కూలీలు ఉన్న చోటనే ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే దిక్కుతోచని పరిస్థితుల్లో కూలీలు మాత్రం సొంత వూళ్లకే వెళ్లేందుకు పయనమవుతున్నారు.

అలా ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వలస కూలీలను యూపీ ప్రభుత్వం నడి రోడ్లపైనే వారిని నిలబెట్టి వాళ్లపై వైరస్ ని నిర్ములించే  రసాయనాలను (సానిటైజర్) లను పిచికారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

విదేశాలనుంచి విమానాల్లో కరోనా వైరస్ తీసుకొచ్చిన వారికి మాత్రం  రాచమర్యాదలతో వారిని ఊరికి సాగనంపుతూ.  అభం శుభం తెలియని వలస కూలీలను మాత్రం ఇలా తక్కువగా చూడటం సరికాదని నెటిజన్లుసోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించి వాళ్ళ ఊళ్లకు తిరిగి వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.   ఈ ఘటనపై ప్రియాంకగాంధీ కూడా స్పందిస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కరోనా వైరస్‌పై మనందరం కలిసి కట్టుగా ఇప్పటివరకూ పోరాడుతున్నాం.

కానీ వలసకూలీల ఘటన లాంటి అమానుష చర్యలకు పాల్పడవద్దు. వలస కార్మికులు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా వారిపై రసాయనాలు చల్లి వారిని మరింత బాధపెట్టవద్దు. రసాయనాలతో పిచికారీ చేస్తే వారి ఆరోగ్యం మరింత హాని కలిగే ప్రమాదముందని ప్రియాంక గాంధి కోరారు..

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular