గురువారం, జూన్ 8, 2023
Homeజాతీయంఢిల్లీ లో కరోనా తో కోలుకున్న వ్యక్తి మాటలు

ఢిల్లీ లో కరోనా తో కోలుకున్న వ్యక్తి మాటలు

దేశం మొత్తం మీద భారత ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం కరోనా కేసుల సంఖ్య వెయ్యి కంటే ఎక్కువే. ఇక మరణాల సంఖ్య 27 దాదాపు 100 మంది దీనినుంచి కోలుకున్నారు అయితే కోలుకున్న వారిలో రోహిత్ దత్తా ఒకరు. అయన యూరప్ నుంచి రాగానే జ్వరం రావడంతో ప్రయాణ అలసట వల్ల  వచ్చిందని అనుకున్నారట.

డాక్టర్ ని కలిసి మందులు తీసుకున్నా తగ్గకపోవడంతో అనుమానం వచ్చి ఫిబ్రవరి 29న కరోనా టెస్ట్ చేయించుకోగా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ  అవ్వడంతో కరోనా ట్రీట్మెంట్ కి తరలించారట.

దింతో  ఢిల్లీ లో కరోనా సోకిన మొదటి రోగిని నేనే అంటూ అయన మీడియా కు తెలిపారు జ్వరం వచ్చి మందులు వేసుకున్నా మూడురోజులు తగ్గకుండా ఫ్లూ లక్షణాలు  అంటే జలుబూ, గొంతు నొప్పి, లాంటివాటితో బాధపడుతున్నట్టయితే వెంటనే దగ్గరలోని ఆస్పత్రులను సంప్రదించండి.

తుమ్మేముందు దగ్గేటప్ప్పుడు చేతిని అడ్డుపెట్టుకోవడం తప్పనిసరి . ప్రతి రెండుగంటలకు ఒకసారి చేతులు కడుకోవడం మర్చిపోవద్దు.. కలిసికట్టుగా కరోనాపై పోరాడటం మనందరి బాధ్యత .

RELATED ARTICLES

Most Popular