గురువారం, ఫిబ్రవరి 22, 2024
Homeజాతీయంతన నోబెల్ బహుమతి దొంగతనం జరిగిందని హౌరా బ్రిడ్జ్ పైకెక్కిన మహిళ

తన నోబెల్ బహుమతి దొంగతనం జరిగిందని హౌరా బ్రిడ్జ్ పైకెక్కిన మహిళ

కోల్‌కతాలో ఉన్న అతిపెద్ద హౌరా బ్రిడ్జ్ పైకెక్కి మహిళ కలకలం రేపి అక్కడి పోలీసులకు చుక్కలు చూపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే కోల్‌కతా లోని అతిపెద్దదైన హౌరా బ్రిడ్జ్ నాల్గోవ పిల్లర్  పైకి ఒక మతిస్థిమితం లేని మహిళ పైకెక్కి సంచలనం రేపింది. అయితే అక్కడి స్థానికులు దిగిపొమ్మని ఎంత మొత్తుకున్నా వినలేదు. అయితే ఆ మహిళా పైకెక్కి అక్కడి నుండి నా నోబెల్ భాహుమతి ఎవరో దొంగతనం చేసారని అతి తీసుకుని వస్తే కిందకు దిగుతానని లేకపోతే ఇక్కడి నుండి దూకేస్తాననడంతో అక్కడి స్థానికులు నోరేల్లబెట్టారు.

దీనితో పోలీసులకు, ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని చాలా సమయం ఆమెను మాటల్లో పెట్టి కిందకు దించే ప్రయత్నం చేసినా అది ఫలించక పోవడంతో పోలీసులు ఆమెతో పెద్ద అధికారులు మీ నోబెల్ భాహుమతి తీసుకురావడానికి వెళ్ళారు నువ్వు క్రిందకు దిగితే అది నీకు ఇచ్చేస్తామని చెప్పడంతో వెంటనే తనకు తానే కిందకు దిగి రావడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular