శనివారం, జూలై 27, 2024
Homeహెల్త్ఆరోగ్యంగా ఉండటానికి మరియు క్యాన్సర్‌ ను నివారించడానికి 8 మార్గాలు.

ఆరోగ్యంగా ఉండటానికి మరియు క్యాన్సర్‌ ను నివారించడానికి 8 మార్గాలు.

ఇక్కడ చెప్పబోయే ఎనిమిది ఆరోగ్యకరమైన ప్రయత్నాలు మీ  ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు అనేక క్యాన్సర్లతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు  డయాబెటిస్ మరియు ఎముకల వ్యాధి వంటి ప్రమాదాలను తగ్గించడానికి బాగా ఉపయోగ పడతాయి. వీటిని సాధారణంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హెల్తి వెయిట్ ను కలిగి ఉండాలి.

మీ శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ఎంతో సులభం అని చెప్పడం చాలా సులభం, కానీ కొన్ని సాధారణ చిట్కాలతో మాత్రం కొంత వరకూ సహాయపడతాయి.

మీ రోజువారీ జీవితంలో శారీరక శ్రమ మరియు మీకు బాగా ఇష్టమైన పని ఎదో ఒకదాన్ని ఎంచుకుని దానిని టైం ప్రకారం ప్రతీ రోజూ తప్పకుండా పాటించాలి. పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి.

2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

మీరు ఎక్కువగా  ఆనందించే పనులలో నడక, గార్డెన్ పని మరియు డ్యాన్స్ సహా స్విమ్మింగ్ వంటి అనేక విషయాలు వ్యాయామంగా పరిగణించబడతాయి. ప్రతిరోజూ ఒకే సమయాన్ని కేటాయించడం ద్వారా వ్యాయామాన్ని అలవాటు చేసుకోండి. రాత్రి భోజనం తర్వాత క్రమం తప్పకుండా నడవడానికి ప్రయత్నించండి.

3. పొగ త్రాగకూడదు.

పొగ త్రాగటం ఆరోగ్యానికి మంచిది కాదని మనకు తెలిసిన విషయమే. అయినా దాన్ని ఎవరూ పాటించరు. దానివల్ల మన ఊపిరితిత్తులకు ప్రమాదం కలిగే అవకాశ ఉంది. అంతేకాక క్యాన్సర్ వంటి వ్యాధులు పొగ త్రాగడం వాళ్ళ శరీరానికి సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండటం మంచిది.

4. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.

పండ్లు మరియు కూరగాయలను ప్రతీరోజూ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి. మీ తృణధాన్యంలో పండు ఉంచండి.

కూరగాయలను చిరుతిండిగా తినడం మంచిది. ఎర్ర మాంసానికి బదులుగా చికెన్, ఫిష్ లేదా బీన్స్ తింటూ శరీరానికి రోజుకు కావాల్సిన ప్రోటీన్స్ ఇవ్వడం ద్వారా ఎక్కువ హేల్డీగా ఉండగలుగుతారు.

5. ఆల్కహాల్.

ఇది శరీరం లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.  కాబట్టి సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం. దీని ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. వీలైనప్పుడుడల్లా దానిమ్మ కాయల రసం తాగండి దీనివల్ల కేన్సర్ బారిన పడకుండా కొంత వరకూ దూరంగా ఉండవచ్చు.

6. సూర్యుడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

శరీరానికి సూర్యుడి వడదెబ్బ తగలడం వల్ల మనిషి చాలా నీరస పడిపోతాడు. దీనివల్ల ఆరోగ్యం లో కూడా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువగా వేడి తగలకుండా కాపాడుకుంటూ ఉండాలి.

7. లైంగిక వ్యాదులనుండి కాపాడుకోవాలి..

ఇతర ఆరోగ్య సమస్యలలో, లైంగిక సంక్రమణ అంటువ్యాధులు మరియు  హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వంటివి – అనేక రకాల క్యాన్సర్లతో ఎక్కువగా ముడిపడి ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్లబారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం వాళ్ళ  ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది.

8.స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

క్యాన్సర్ వ్యాది నుండి మనల్ని రక్షించుకోడానికి సహాయపడే అనేక ముఖ్యమైన స్క్రీనింగ్ పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి.  క్యాన్సర్ ఇంకా స్టేజ్ లు దాటి ఎక్కువగా పెరగకుండా ఉండటానికి ఈ స్క్రీనింగ్ పరీక్షలు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి డాక్టర్ల సూచనలతో తగిన పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ఉత్తమం.

ఇప్పుడు చెప్పుకున్న జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల ప్రతేఒక్కరూ తమ ఆరోగ్యాన్ని క్యాన్సర్ నుంచి సురక్షితంగా కాపాడుకోవచ్చు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular