వేసవి కాలంలో సూర్యుడి వేడి చాలా అదికంగా ఉంటుంది. ఈ అదిక వేడి వల్ల శరీరం చల్లదనాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా మన ఒంట్లో శక్తి కూడా చాలా వరకూ తెలియకుండానే కోల్పోతాం. ఇకపై అలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వేసవి లో ఆరోగ్యానికి మనం ఏ పండ్లు తీసుకుంటే ఆరోగ్యాంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.
- ద్రాక్ష :- ద్రాక్ష పళ్ళు తినటం వల్ల మనకు వడ దెబ్భ తగలకుండా ఇవి చాలా వరకూ కాపాడుతుంది. దీనివల్ల వేడి మంటలను తగ్గిస్తుంది. మైగ్రేన్ మరియు కంటి సమస్యలతో బాదపదేవారు ద్రాక్ష తినటం వల్ల ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు.
- ఆరంజ్ :- ఆరంజ్ తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆరెంజ్ లో సి విటమిన్ పుష్కలంగా లబిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కిడ్నీలకు సబంధించిన వ్యాధులు రావు. అంతేకాక లివర్ క్యాన్సర్ నుంచి ఇవి కాపాడుతాయి. ఇందులో ఉన్న విటమిన్స్ వల్ల మనకు చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.
- పుచ్చకాయ:- సాదారణంగా పుచ్చ కాయలు వేసవి కాలంలో ఎక్ఈకువగా లబిస్తాయి. పుచ్చకాయ తీసుకోవడం వల్ల ఎముకలకు చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల ఎటువంటి కంటి సబందిత జబ్బులు గుండె జబ్బులు రావు. పుచ్చకాయలోని పోషకాల వాళ్ళ మన కండరాలను మరియు నరాలను ఉత్తేజ పరిచి బాగా పనిచేసేలా చేస్తాయి.
- ఆపిల్:- రోజూ ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదని చాలా మంది చెబుతారు. దానిలోని పోషకాలు తెలిస్తే అది నిజమేనని మనం నమ్మాల్సిందే. ఎందికంటే ఆపిల్ తినడం వల్ల మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. దేనిని తీసుకోవడం వల్ల ఎటువంటి క్యాన్సర్ లను మన దరి చేరనివ్వదు. ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. చేసు కొలెస్ట్రాల్ బయటికి పంపిస్తుంది. మరియు అల్జీమర్ వంటి వాటి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.
- స్ట్రాబెర్రీ:- మీ చర్మాన్ని ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది, రోగ నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది అంతేకాక శరీర శక్తిని పెంచుతుంది, శరీరంలోని మంటను తగ్గిస్తుంది, క్యాన్సర్ వంటి కణాలను రాకుండా పోరాడుతుంది.
- జామకాయ:- శరీరంలోని హార్మోన్ల పనితీరును మెరుగుపరుచి వాటిని సంతులంగా ఉండేటట్లు చూస్తుంది. మలబద్ధకం వంటివి రాకుండా సహాయపడుతుంది, శారీరిక శ్రమను తగ్గించి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది మరియు మెదడుకు మంచిది.
- కివీస్ :- ఇది ప్రసవించిన తర్వాత మహిళలకు మంచిది ఎందుకంటే వీటిద్వారా రోగనిరోధక శక్తి ఎక్కువగా పెంచుతుంది. మరియు ఆకలి పుట్టిస్తుంది ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది.
- పైన పేర్కొన్న ఈ పండ్ల వల్ల అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలిసినా కూడా వాటిని తినకపోతే మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకున్నవారవుతాము అందుకే ఇప్పటి నుంచి ప్రతీరోజూ లేదా ప్రతి వేసవిలో ఈ పండ్లను తిని మన ఆరోగ్యాన్ని మరింత కాపాడుకుందాం.