శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeరాజకీయంహైకోర్టు పిలుపు రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు.. హస్తిన బాట

హైకోర్టు పిలుపు రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు.. హస్తిన బాట

సుప్రీం కోర్టు గత కొద్ది రోజుల క్రితం పెండింగ్ లో ఉన్న రాజకీయ నాయకులపై ఉన్న కేసులను సంవత్సరం లోపు పూర్తి చెయ్యాలని  ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కోరడంతో కేంద్రం అవినీతి పరుల సంగతి ఇక తెల్చేయాలంటూ ఇక రాజకీయ నాయకులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించడానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని కేంద్రం తెలిపింది.

దీనితో ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. దీనిలో భాగంగా నిన్న తెలంగాణా హైకోర్టు సైతం ఇకపై రోజువారీ విచారణ చేపట్టాలని దీనికి సంబందిచిన ప్రోసేస్ త్వరలో మొదలు పెట్టాలని తెలిపింది.

అయితే కరోనా నేపధ్యంలో చాలా వరకూ కోర్టులు కేసుల విచారణను ఆన్లైన్ లోనే చేపట్టాయి. అయితే ఇప్పుడు తెలంగాణా హైకోర్టు సుప్రీం కోర్టు మార్గదర్శకాల దృష్ట్యా కేసుల విచారణ వేగవంతం చేయడంలో భాగంగా కరోనా నిబంధనలను సైతం సడలిస్తూ ఇకపై డైరెక్ట్ విచారణ మొదలు పెట్టబోతోంది.

విచారణ చేపట్టే కేసుల్లో ప్రధానంగా మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే కేసులను ముందుగా విచారిస్తారు. వీటితోపాటు నగదు అక్రమంగా చలామణీ అవినీతి వంటి వాటిని ఆయా కేసుల సంఖ్యను బట్టి ముందుగా విచారిస్తారు. ఇక సీబీఐ, ఈడీ వద్ద పెండింగ్ లో ఉన్న కేసులను సైతం పూర్తి చెయ్యాలని బావిస్తోంది.

ఇక వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిపి 175 కేసులు ఉండగా ఏపీ సీఎం జగన్ పై 38 కేసులు పెండింగ్ లో ఉండడంతో ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు జగన్ సైతం అక్టోబర్ 23న కేంద్ర పెద్దలను కలుసుకోగా నేడు తెలంగాణా హై కోర్టు విచారణ అనగానే హుటాహుటిన మళ్ళీ ప్రదాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 

అయితే జగన్ కు దాదాపు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ప్రదాని మాత్రం ఈ విషయానికి కొంచెం దూరంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular